- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో నేరస్తులకు చట్ట భయం లేదు!
భారతదేశంలో హత్య, అత్యాచారం, తీవ్రవాదం, మాదక ద్రవ్య రవాణా వంటి చాలా ఘోరమైన, అరుదైన కేసులలోనే

భారతదేశంలో హత్య, అత్యాచారం, తీవ్రవాదం, మాదక ద్రవ్య రవాణా వంటి చాలా ఘోరమైన, అరు దైన కేసులలోనే విచారణ కోర్టులు మరణశిక్ష విధిస్తా యి. కోర్టులు ఇప్పటివరకు 2000 నుండి 3,000 మందికి పైగా మరణశిక్షలు విధించాయి. కానీ, కేవలం ఎనిమిది మందిని మాత్రమే ఉరి తీశారు. చివరి సారిగా 2020లో నిర్భయ కేసులో నలుగురిని ఉరి తీశారు. అయితే పొక్సో చట్టం కింద పదుల కొద్దీ మరణ శిక్షలు విధించినప్పటికీ నేటి వరకు ఒక్క దోషినీ ఉరి తీయలేదు. భారతదేశం చట్టాల్లో మరణశిక్షను ఉంచి, ఆచరణలో దాన్ని అమలు చేయని దేశంలా కనిపిస్తోంది. చట్టంలో ఉన్న వెసులుబాట్లు, అప్పీళ్లు, క్షమాభిక్ష పిటిషన్ల వల్ల ఉరిశిక్ష అమలు చాలా ఆలస్యం అవుతోంది. శిక్షను తగ్గించడానికి చివరికి ఈ అలస్యమే ఒక కారణంగా మారుతోంది. కానీ అమెరికాలో అలా కాదు, అక్కడ నేరస్తులను శిక్షించడానికి మరణశిక్షను ఇప్పటికీ ఒక సాధనంగా వాడుతున్నారు. చైనాలోనైతే ‘ఉరిశిక్ష వాయిదా’ అనే ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. దీని ప్రకారం, కోర్టు దోషికి మరణశిక్ష విధించి, రెండేళ్లపాటు ఆ శిక్ష అమలును ఆపుతుంది. ఆ రెండేళ్లలో దోషి మంచిగా ప్రవర్తిస్తే, శిక్షను యావజ్జీవ కారా గార శిక్షగా మారుస్తారు. కానీ మళ్లీ ఏదైనా నేరం చేస్తే, వెంటనే ఉరి తీస్తారు. ఈ పద్ధతి వల్ల అక్కడ నేరాలు తగ్గాయి. కానీ భారతదేశంలో మరణశిక్ష కేవలం పేరుకే ఉండటం వల్ల నేరస్తులకు చట్ట భయం లేకుండా పోతోంది. ఎన్‌సీఆర్బీ ప్రకారం, 2021తో పోలిస్తే 2022లో దేశంలో నేరాలు 4.5% తగ్గాయి, కానీ మహిళలు, పిల్లలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే భారతదేశం చట్టాల్లో ఉన్న శిక్షలను అమలు చేయాల్సిందే. శిక్షల ఆలస్యం వల్ల బాధితుల కుటుంబాలు ఏళ్ల తరబడి నరకం చూస్తు న్నాయి. మరోవైపు, నేరస్తులు కూడా బతుకో, చావో తెలియని స్థితిలో దశాబ్దాల పాటు జైళ్లలో మగ్గిపోతున్నారు. న్యాయస్థానాలు ఖరారు చేసిన ఉరిశిక్షలను త్వరగా అమలు చేయాలి. లేదా చైనా వలె 'వాయిదా మరణశిక్ష' పద్ధతిని తీసుకురావాలి. ఈ చట్టాలు సవరణ చేయాలి. లేకపోతే, మరణశిక్ష అనేది నేరస్తులకే గాక, బాధితులకు, సమాజానికి కూడా క్షోభగా మారుతుంది.
-శ్రీనివాస్ మాధవ్






