- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తరగతి గదుల్లో రీల్స్ సరికాదు..!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర సంస్థల్లో కొంత మంది ఉద్యోగులు అదే పనిగా రీల్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా పాఠశాలల్లో, ఉపాధ్యాయులు విద్యార్థులకు మొబైల్స్ ఇస్తూ వీడియోస్, రీల్స్ తీయిస్తూ మొబైల్స్‌కు అట్రాక్ట్ చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర సంస్థల్లో కొంత మంది ఉద్యోగులు అదే పనిగా రీల్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా పాఠశాలల్లో, ఉపాధ్యాయులు విద్యార్థులకు మొబైల్స్ ఇస్తూ వీడియోస్, రీల్స్ తీయిస్తూ మొబైల్స్‌కు అట్రాక్ట్ చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పాఠశాలల్లో విద్యార్థులకు బోధన చేయకుండా అదే పనిగా రీల్స్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నారని నిత్యం తమ పిల్లలకు మొబైల్స్ ఇస్తూ వీడియోలు తీయిస్తున్నారని, లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు లైక్స్, కామెంట్స్ చూస్తూ రోజు మొత్తం తరగతి గదుల్లో మొబైల్స్ వినియోగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిజానికి పాఠశాలల్లో చేసే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను రీల్స్ రూపంలో అది కూడా బోధన లేని రోజుల్లో చేస్తే ఎవరికి అంతా ఇబ్బంది ఉండదు.. కానీ కొందరు టీచర్లు అయితే పాఠాలు బోధిస్తున్నప్పుడు కూడా తమ తరగతి గదిలోని విద్యార్థులకు మొబైల్స్ ఇస్తూ వీడియోలు తీయించడం రీల్స్ అప్లోడ్ చేయడం సరికాదు. ఇలా అయితే విద్యార్థులకు బోధనపై దృష్టి ఉంటుందా? పాఠాలు వినకుండా రీల్స్ తీయించడం సరికాదు. రీల్స్, సబ్స్క్రైబ్ పేరుతో అనునిత్యం కొంత మంది ఉపాధ్యాయులు మొబైల్స్ వినియోగిస్తున్నారు. కొంతమంది అయితే స్కూల్ ఆవరణలోనే ఫోక్ సాంగులకు డ్యాన్సులు కూడా వేస్తున్నారు.. ఇలా చేయడం వల్ల వారితో పని చేసే ఉద్యోగులకు కూడా ఇబ్బందిగా ఉంది. మరి కొంత మంది బోర్డుపై ఏదో ఒకటి రాస్తున్నట్టు చేసి.. విద్యార్థులకు మొబైల్స్ ఇస్తూ రీల్స్ చేయడం వల్ల తమ పిల్లలు పూర్తిగా మొబైల్స్‌కి అట్రాక్ట్ అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసే కొంతమంది ఉద్యోగులు వారి సొంత పిల్లలకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు అలాగే చేస్తే వారికి మద్దతు ఇస్తారా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు తరగతి గదిలో స్కూల్ ఆవరణలో ఇష్టానుసారం చేసే రీల్స్ నిషేధించాలి.
- రావుల రామ్మోహన్ రెడ్డి
63054 58920






