కాలేజీ ఫీజు 100 శాతం పెంపు.. కాలేజీలకు ఈ అర్హతలున్నాయా?

by Ravi |   (  Updated:2025-05-28 00:31:03  IST  )

సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీలను మెజారిటీగా ఆడిట్ చేసేది జెఎన్‌టీయూ యూనివర్సిటీ అధికారులు.. వారే కాలేజీలో ఫ్యాకల్టీ

కాలేజీ ఫీజు 100 శాతం పెంపు.. కాలేజీలకు ఈ అర్హతలున్నాయా?
X

సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీలను మెజారిటీగా ఆడిట్ చేసేది జెఎన్‌టీయూ యూనివర్సిటీ అధికారులు.. వారే కాలేజీలో ఫ్యాకల్టీ ఎంత మంది ఉన్నా రు. ఎంత హాజరు శాతం ఉంది, వారికిచ్చే జీతాలు ఎంత, ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇతర ఫెసిలిటీస్ ఏమిటి? ఇవన్నీ చెక్ చేసి నివేదిక రూపొందిస్తుంది. ఏదైనా కాలేజీ ఫీజు పెంచాలంటే ఈ ఆడిట్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని ఫీజు పెంపు ఉంటుంది. కానీ ఈ సారి యూనివర్సిటీ ఆడిట్ పరిగణనలోకి తీసుకోకుండా ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఫీజు పెంపు ప్రతిపాదన చేసింది. పైగా కాలేజీల ఫీజుల పెంపు ప్రపోజల్స్‌ను యూనివర్సిటీ ఆమోదించింది. ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఫీజులు అధికారికంగా పెంచడానికి ఉందా? కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫ్యాకల్టీకి తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఇదేమీ అని ప్రశ్నించిన లెక్చరర్లను, ప్రొఫెసర్స్‌ను బెదిరించి అర్ధాంతరంగా తీసి బయటకు నెట్టేస్తున్నారు. చేసేది లేక చాలా మంది ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్ తలూపి అకౌంట్‌లో వేసిన డబ్బు లను తిరిగి సగం ఇస్తున్నారు. ఇది బహిరంగ సత్యం. దీన్ని FRC పట్టించుకోవడం లేదు. పోనీ వారేమైనా రీ చెక్ చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఇంజనీరింగ్ ఫీజులు 100 శాతం పెంచడం అంటే కొన్ని కాలేజీల ఫీజు 5 లక్షలు అవుతుంది. ఇంత ఫీజు తల్లిదండ్రులు ఎలా కట్టగలరు.. ట్రస్ట్ పేరుతో సేవ చేయడానికి విద్యా సంస్థ ఏర్పాటు చేశామని చెప్పి అధిక ఫీజులు పెంచాలని కోరడం ఏమిటి? ఫ్యాకల్టీకి ఎక్కువ జీతాలు ఇవ్వకుండానే ఫీజులు ఎందుకు పెంచాలో హేతుబద్ధత లేదు. పోనీ కమిటీ సభ్యులు రీ చెక్ కానీ, పరిశీలన కానీ చెయ్యకుండా ఒకే చెప్పడం ఏమిటి? కావున JNTU, ఉస్మానియా యూనివర్సిటీ ఆడిట్ పరిగణనలోకి తీసుకొని ఫీజులను పెంపును పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

విజయ్‌ కుమార్

95737 15656

Next Story