- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులగణన సామాజిక సంజీవని
దేశంలో కులమే జీవణ ప్రమాణానికి ఆధారమని, అనివార్యమని అందరూ అంగీకరించాల్సిన అంశం. వ్యక్తి రాజకీయ, ఆర్థిక

దేశంలో కులమే జీవణ ప్రమాణానికి ఆధారమని, అనివార్యమని అందరూ అంగీకరించాల్సిన అంశం. వ్యక్తి రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ రంగాలలో ఎంత ఎత్తుకు ఎదగగలడనేది దేశంలో తన కుల పునాది పరిధి నిర్ణయిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక తెలంగాణే తమ లక్ష్యమంటూ ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎవరూ ఊహించని రీతిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. నాడు ఆలోచనపరంగానో అనివార్యంగానో... తెలంగాణ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కులగణన కాంగ్రెస్ పార్టీకి నేడు రాజకీయ విష్ణు చక్రాయుధంగా తయారయ్యే అవకాశం ఉన్నది.
కుల సర్వే నిర్వహించమంటూ..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక బీసీ సంఘాల ఒత్తిడితో 2024 ఫిబ్రవరి మాసంలో ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే’ నిర్వహిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే కులగణన చేయడం ద్వారా కుల వైషమ్యాలు పెరిగి దేశ సమగ్రత దెబ్బతింటుందనే విద్వేషాలను అగ్రకుల రాజకీయ నాయకులు, మేధా వులు ప్రచారం చేశారు. అయితే ప్లానింగ్ కమిషన్ చేత 60 రోజుల్లో పూర్తి చేస్తామన్న కుల సర్వే తీర్మానాన్ని ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఒకానొక సమయంలో కులసర్వే నిర్వహించకుండానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వాన్ని పౌర సమాజం సహజంగానే ప్రతిఘటించింది. ముఖ్యంగా బీసీలు కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కులగణన నిర్వహణ, 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లకై పట్టుబట్టి ఉద్యమించారు. దీంతో ప్రభుత్వం ఇంటింటి కుల సర్వేను ప్రారంభించింది. సహజంగానే రాష్ట్రంలో కొంత అగ్రకులాలు కుల సర్వేను వ్యతిరేకించి.. సర్వేకు దూరంగానే ఉన్నాయి. ఇలా అనేక సవాళ్ళను దాటుకుని పూర్తిచేసుకున్న కులసర్వే రిపోర్టును 2025 ఫిబ్రవరి 4న ప్రభుత్వం అసమగ్రంగానే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
చట్టబద్ధత వీటికి కల్పించాలి!
అయితే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించినట్టుగా వివిధ కుల జనాభా లెక్కలు వారి సామాజిక, ఆర్ధిక, విద్యా, ఉద్యోగ రాజకీయ పరిస్థితులను సమగ్రకుల సర్వే ద్వారా బహిర్గతమవుతుందని తెలంగాణ పౌర సమాజం ఆశించింది. దానికి భిన్నంగా ప్రభుత్వం కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీలుగా జనాభాను మాత్రమే అసెంబ్లీ వేదికగా ప్రకటించి వెనుకబడిన తరగతుల అసంతృప్తిని మూటగట్టుకుంది. దీనిని అడ్వాం టేజ్‌గా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వర్గాలను, ఇటు పౌర సౌమజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రజలు ఆధికార కాంక్షను, రాజకీయ కుట్రలను పసి గట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పిస్తామని చెబుతుంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినట్టుగా కేవలం స్థానిక సంస్థలే కాకుండా విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచి చట్టబద్ధత కల్పించాలి. ఈ చట్టబద్ధత భవిష్యత్‌లో కోర్టులలో నిలబడుతుందా..లేదా? అనేది మరో అంశం. ఏదేమైనా ఈ సమగ్ర లెక్కలు ప్రతి కులం, అన్ని రంగాలకు రూపమిచ్చి భవిష్యత్‌లో రూపొందించే సంక్షేమ ప్రోత్సాహకాలకు ఆధారం కానున్నాయి. అలాగే రాహుల్ గాంధీ తరుచుగా ఉటంకిస్తున్న సామాజిక న్యాయం, సమగ్ర కులగణన ఆ పార్టీకి ప్రతి పక్షాలను ఎదుర్కొనే ఆస్త్రంగా.. వెనుకబడిన తరగతుల సమస్యలకు సంజీవనిగా మారనుంది.
నూకల మధు యాదవ్
ఉస్మానియా యూనివర్సిటీ
63033 43359






