- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటోన్మెంట్ వీధులకు స్థానికుల పేర్లు పెట్టాలి!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్ల పేర్ల మార్పు వివాదానికి దారితీసింది. బ్రిటిష్ కాలం పేర్ల స్థానంలో కొత్త పేర్లు పెట్టడంపై స్థానిక చరిత్ర, తెలంగాణ మహనీయులకు ప్రాధాన్యం, ప్రాంతీయ అస్తిత్వం, ప్రజాభిప్రాయంపై విశ్లేషణ.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మొత్తం 21 రోడ్ల పేర్లను మార్చాలని కంటోన్మెంట్ అధికారులు నిర్ణయించి, అక్కడ కొన్ని పాత బోర్డులను తొలగించి కొత్త బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ చర్య వివాదాస్పదమయింది. కంటోన్మెంట్‌లోని వీధుల పేర్లు బ్రిటిష్ కాలానికి చెందినవని, వాటి స్థానంలో దేశీయుల పేర్లు పెట్టడం ద్వారా “వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి” సాధించాలనే ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే సికింద్రాబాద్‌కు సంబం ధం లేని వివేకానంద, పరమహంస, వాజ్‌పేయి వంటి పేర్లతో వీధుల పేర్లు ఏకపక్షంగా మార్చడం ప్రాంతీయ అస్తిత్వాన్ని పక్కనపెట్టినట్లుగా కనిపిస్తోంది. అలాగే వీధుల పేర్లకు “మార్గ్” అనే పదం ఉపయోగించడం ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. బ్రిటిష్ పేర్లను మార్చా లనుకుంటే, స్థానిక యోధులు, మహనీయుల పేర్లు పెట్టడం సమంజ సం. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన ఎమ్మార్ కృష్ణ, తులసీ బలరామ్, టి.వి. నారాయణ, టి.ఎన్. సదాలక్ష్మి వంటి ప్రముఖుల పేర్లు పరిశీలించవచ్చు. అలాగే కార్గిల్, 1971 యుద్ధాల్లో అమరులైన తెలంగాణ సైనికుల పేర్లు కూడా పెట్టాలి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ అమరుల పేర్లను పక్కనపెట్టి, స్థానికేతరుల పేర్లు పెట్టడం తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసినట్లుగా భావించబడుతుంది. ఇది స్థానిక ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించవచ్చు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ. జయశంకర్, గద్దర్ వంటి అనేక స్థానిక నాయకులు, మహనీయులు ఉన్నారు. వీరి పేర్లు పెట్ట కుండా ప్రజలకు సంబంధం లేని పేర్లు రుద్దడం అన్యాయం. స్థానిక ప్రజల భావాలను గౌరవించి, స్థానిక చరిత్రకు అనుగుణంగా పేర్లు నిర్ణయించాలని, లేకపోతే అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది.
-డా. మనోహర్ రెడ్డి
9949853080






