పవన్ కల్యాణ్ సినిమాలో పూజా హెగ్డేకు బంప‌ర్ ఆఫ‌ర్..?

by velandi.Saikiran |

పవన్ కల్యాణ్ సినిమాలో పూజా హెగ్డేకు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్లు టాక్‌.

పవన్ కల్యాణ్ సినిమాలో పూజా హెగ్డేకు బంప‌ర్ ఆఫ‌ర్..?
X

దిశ‌, వెబ్ డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార పూజా, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రభాస్, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా హీరోలతో వరుసగా ఛాన్స్ లు కొట్టేసింది. ఇక 2020లో అలా వైకుంఠపురంలో సినిమాలో మెరిసిన పూజా, పెద్ద హిట్టు అందుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే, ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగులో సినిమా చేయలేదు పూజా. ఆమెకు అవ‌కాశాలు రాలేద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాంటి పూజా హెగ్డేకు తాజాగా బంపర్ ఆఫర్ తగిలింది. OG 2 సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా హీరోయిన్ ను వెతుకుతున్నాడట దర్శకుడు సుజీత్. ఈ క్రమంలోనే పూజా హెగ్డేను సంప్రదించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ముందుగా కాజల్ అగర్వాల్ పేరు వినిపించినప్పటికీ... ఇప్పుడు పూజా హెగ్డేను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఈ ప్రాజెక్టు ఓకే అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story