- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ కింగ్స్ కు ఎదురుదెబ్బ..శశాంక్ సింగ్ పై కేసు నమోదు
శశాంక్ సింగ్, ఆయన తండ్రి మాజీ ఐపీఎస్ శైలేష్ సింగ్ పై కేసు నమోదు అయింది.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్స్ డేంజర్ ఆటగాడు శశాంక్ సింగ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. శశాంక్ సింగ్, ఆయన తండ్రి మాజీ ఐపీఎస్ శైలేష్ సింగ్ పై కేసు నమోదు అయింది. కొత్తగా పనిలో చేరిన వంట మనిషిని హింసించి, తీవ్రంగా దాడి చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తనను దూషిస్తూ మానసికంగా హింసిస్తుండే వారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో శశాంక్ ఫ్యామిలీపై కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా ప్రాంతానికి సంబంధించిన విపేంద్ర సింగ్, ఇటీవల భోపాల్ లో నివాసం ఉంటున్న శశాంక్ సింగ్ ఇంట్లో వంట మనిషిగా చేరాడు.
ఈ క్రమంలో అతనికి 15 వేల జీతం, వసతితో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, వంట మనిషిగా శశాంక్ ఫ్యామిలీ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పనిలో చేరిన నాలుగు రోజులకే, విపేంద్ర సింగ్ వండిన వంటలు బాగుండటం లేవంటూ శశాంక్ సింగ్ ఫ్యామిలీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది. దూషించడంతో పాటు దారుణంగా కొట్టినట్లు సమాచారం. ఇక తాను అక్కడ ఉండలేనని, బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే శశాంక్ సింగ్, అతని తండ్రి శైలేష్ సింగ్, ఇంటి డ్రైవర్ కలిసి విపేంద్ర సింగ్ పై క్రూరంగా భౌతిక దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫోన్ కూడా లాగేసుకున్నారని బాధితుడు పేర్కొన్నారు. ఇక ఈ దాడి నేపథ్యంలో గాయాలతోనే రాతీ బఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విపేంద్ర సింగ్ తోమర్. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






