ప్రభుత్వ బడులను కాపాడుకోలేమా?

by Ravi |   (  Updated:2025-11-20 00:30:56  IST  )

దేశంలో సర్వశిక్షా అభియాన్ నిబంధనలు అనుసరించి కిలోమీటరు పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలనే నియమం ఉంది.

ప్రభుత్వ బడులను కాపాడుకోలేమా?
X

దేశంలో సర్వశిక్షా అభియాన్ నిబంధనలు అనుసరించి కిలోమీటరు పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలనే నియమం ఉంది. ఈ లెక్కన 2023–24 ప్రభుత్వ విద్యా గణాంకాల ప్రకారం తెలంగాణలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా.. చాలామంది తల్లిదండ్రులకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలనే ఆలోచన కూడా పరిగణించడం లేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వ పాఠశాల వైఫల్యం గురించి వివరిస్తూ.. రాష్ట్రంలోని సుమారు 13వేల ప్రాథమిక పాఠశాలల్లో 50 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని తెలిపింది. ASER నివేదిక 2023 ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి పిల్లలు 25.9% మంది మాత్రమే 2వ తరగతి పాఠ్యాన్ని చదవగలరు, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది 42.3%గా ఉంది. ఇక రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం టాయ్‌లెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు చేరాలంటే, ప్రభుత్వ పాఠశాలల పునరేకీకరణ, సిబ్బంది సర్దుబాటు తదితర విషయాల్లో ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు అవేమీ చేయకుండా కేవలం పైపై లేపనాలతోనే సరిపెడుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను పటిష్టంగా అమలు చేయడం ప్రభుత్వం ముందున్న బాధ్యత. ఈ నివేదికలోని అంశాలు అమలు కావాలంటే నిధుల కేటాయింపు, ప్రణాళికేతర వ్యయంతో తప్ప మరో గత్యంతరం లేదు. ప్రభుత్వ బడుల భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. అలాగే రాష్ట్రంలోని 9,517 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసి, పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి సారించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచితో, శుచితో విద్యార్థులకు అందజేయాలి.

-నరేష్,

83097 87957

Next Story