- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సులే.. పాడెలుగా మారి
అదుపులేని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణీకుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా చేస్తున్నా యి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సులోనే ఆహుతి అయిన 19 మానవ ప్రాణాలు ఈ దుస్థితికి ఉదాహరణ.

అదుపులేని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణీకుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా చేస్తున్నా యి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సులోనే ఆహుతి అయిన 19 మానవ ప్రాణాలు ఈ దుస్థితికి ఉదాహరణ. ఆ ప్రమాద కారణాలు ప్రత్యక్షంగా ఏవైనప్పటికీ, అలాంటి ప్రమాదం ఏర్పడడానికి పరోక్షంగా దోహదపడిన పరిస్థితుల్ని చక్కదిద్దడానికి పూనుకోకపోతే మళ్లీ మళ్లీ అలాంటి దురదృష్టకర సంఘటనలు పెచ్చరిల్లుతాయి. ఈ దుర్ఘటన జరిగాక తెలుగు రాష్ట్రాల్లో సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి ఎన్నో బస్సులను సీజ్ చేశారు. కళ్లెదుట ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణించే బస్సులు కేవలం ఒక్కటి రెండు తనిఖీలోనే పదుల కొద్దీ సంఖ్యలో బస్సులు ప్రయాణింప వీలుగాని కండిషన్‌లో ఉన్నాయంటే వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమౌతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ మితిమీరి లాభాలు పొందడానికి గడ్డి కరిచినా, వాటిని నియంత్రించే వ్యవస్థకి ఏమైంది? ఈ ట్రావెల్స్ వారందరూ ఆల్ ఇండియా పర్మిట్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకొని ఇక్కడ తిప్పడంలోనే అవినీతి జాడలున్నాయి. ఇక సిటింగ్‌కి అనుమతి తీసుకుని, స్లీపర్‌గా మార్చి ప్రయాణీకుల రక్షణని రోడ్డున పడేస్తే, అధికారులు గమనించలేక పోతున్నారా? అగ్నిమాపక నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన చోట చూసీచూడనట్లు వదిలేయడం ఎంత దారుణం? ఈ రెండు రోజుల్లో నమోదైన అతిక్రమణల కేసులు చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే.. నిబంధనలు పాటించే వారి కన్నా అతిక్రమించే వాళ్లే ఎక్కువగా ఉన్నారని వీటిని నియంత్రించాల్సిన వ్యవస్థలు అలసత్వంతోనో, అవినీతితోనో కళ్లు మూసుకొంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే జరిగే తనిఖీల హడావిడి రెండ్రోజుల తర్వాత పూర్తిగా అటకెక్కించకుండా కొనసాగించాలి. ఎందుకంటే పాడె మారు వేషంలో బస్సుగా మారి రోడ్డు మీద స్పీడుగా తిరుగుతుంది. ఈ స్థితి మారాలి. రోడ్డు నిబంధనలను నిక్కచ్ఛిగా పాటించేలా చూడాలి. స్పీడు అతిక్రమించితే బైక్ నైనా సీజ్ చెయ్యాలి. భారీగా పెనాల్టీ వెయ్యాలి. ఇటువంటి చర్యల ద్వారానే రోడ్డు ప్రమా దాల్లో విలువైన ప్రాణాల్ని కాపాడుకోగలం.
-డా.డి.వి.జి. శంకరరావు,
94408 36931






