సామాన్యుడికి అభయం లేని బడ్జెట్!

by Ravi |   (  Updated:2026-02-04 00:30:34  IST  )

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దీర్ఘకాలిక ప్రణాళికల్ని చూపిస్తూ.. 'సామాన్యులను ప్రస్తుతానికి ఇలాగే సర్దుకోండి' అన్నట్టు ఉంది. ఆర్థిక సర్వే ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా, పటిష్టంగా ఉంది. కనుక ఆ ప్రభావంతో బడ్జెట్‌లో ప్రజలకు నేరుగా మంచి ప్రయోజనాలు ఉండొచ్చని ఆశించిన వారికి భంగపాటు అయింది.

సామాన్యుడికి అభయం లేని బడ్జెట్!
X

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దీర్ఘకాలిక ప్రణాళికల్ని చూపిస్తూ.. 'సామాన్యులను ప్రస్తుతానికి ఇలాగే సర్దుకోండి' అన్నట్టు ఉంది. ఆర్థిక సర్వే ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా, పటిష్టంగా ఉంది. కనుక ఆ ప్రభావంతో బడ్జెట్‌లో ప్రజలకు నేరుగా మంచి ప్రయోజనాలు ఉండొచ్చని ఆశించిన వారికి భంగపాటు అయింది. ఈసారి ద్రవ్యలోటుని అదుపులో ఉంచడం, రానున్న రోజుల్లో స్థూల ఆర్థిక వ్యవస్థను బలీయంగా ఉంచడానికి ప్రయత్నించడమన్నవి ప్రాధాన్యతలుగా మారి, సంక్షేమం, ఆర్థిక సమానత్వంతో కూడిన వృద్ధి అన్నవి వెనక బడ్డాయి.. జన సామాన్యానికి కొత్త పథకాలు, అభయం ఇచ్చే హామీలు, కేటాయింపులు లేవు.. దేశీయ మౌలిక వసతులు ఏర్పాటు, పరిశ్రమలకు ఊతం కల్పిస్తూ మూలధన వ్యయం పెంచుతున్నట్లు ప్రకటించారు.. ఆ దిశగా 12 లక్షల కోట్లు ప్రతిపాదన చెయడం ఇదే మొదటిసారి.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం బాగుంది. కానీ ఎగుమతుల విషయంలో ప్రపంచ పరిణామాల మధ్య ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. బడ్జెట్‌లో తలపెట్టిన హై స్పీడ్ కారిడార్లు, ఖనిజ కారిడార్లు, పర్యాటక రంగంపై ఫోకస్ ద్వారా అవి తెచ్చే లాభాలకు, పరోక్షంగా వాటివల్ల ప్రజలకు, పర్యావరణానికి, హక్కులకు కలిగే నష్టాలతో బేరీజు వేసి వాస్తవ స్థితిని చూడాల్సి ఉంటుంది. విద్యా, నైపుణ్య రంగాలకు కేటాయింపులు బాగానే ఉన్నా, భవిష్యత్‌ని, ఉపాధిలేమి, నిరుద్యోగితని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా చాలా అవసరం. విద్యా వైద్య రంగాలకు కేటాయింపులు అవసరమైన స్థాయిలో లేవు.. బడుగు వర్గాల సంక్షేమం కూడా ఆశించిన స్థాయిలో కేటాయింపులను నోచుకోలేదు.. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెంచాల్సింది. సంపన్నులకు కొంచెం బాధ్యత పెంచి, సామాన్యులకు కొంచెం భారం తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచి జరిగేది. మొత్తానికి త్రీడీ కళ్లద్దాలతో చూస్తే దారి చివర నున్నటి భవనం. కానీ నడవ డానికి మాత్రం గతుకుల రోడ్డు ఉన్నట్టుంది..

-డా. డి.వి.జి.శంకర రావు,

94408 36931

Next Story