- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతరత్న... గాడ్సేకి వద్దా?
మోహన్ భగవత్‌కు ఇప్పుడు సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసే ధైర్యం వచ్చింది. ఇప్పుడు సహజ౦గా ఒక ప్రశ్న తలెత్తుతుంది భారతరత్న సావర్కర్‌కేనా నాథూరామ్ గాడ్సేకు కూడా ఎందుకు ఇవ్వకూడదు? బహుశా గాడ్సేకి ఈ అవార్డు కోసం హిందూ రాజ్య ప్రకటన అధికారిక౦గా వచ్చేవరకు మనం వేచి ఉండవచ్చునేమో?

మోహన్ భగవత్‌కు ఇప్పుడు సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసే ధైర్యం వచ్చింది. ఇప్పుడు సహజ౦గా ఒక ప్రశ్న తలెత్తుతుంది భారతరత్న సావర్కర్‌కేనా నాథూరామ్ గాడ్సేకు కూడా ఎందుకు ఇవ్వకూడదు? బహుశా గాడ్సేకి ఈ అవార్డు కోసం హిందూ రాజ్య ప్రకటన అధికారిక౦గా వచ్చేవరకు మనం వేచి ఉండవచ్చునేమో?
మతోన్మాద చర్యలు పెరిగుతున్నాయ్!
నిజానికి వీళ్లిద్దరి బంధం విడదీయరానిది. సావర్కర్ హత్యకు ప్రణాళిక వేశాడు. గాడ్సే అమలు చేశాడు. సావర్కర్ సిద్ధాంతాన్ని అందించాడు. గాడ్సే ట్రిగ్గర్‌ను నొక్కాడు. సావర్కర్ హిందూ రాష్ట్రం గురించి కలలు కన్నాడు. అవిభక్త భారత ఉపఖండంలో ముస్లింల౦దరినీ వీలైతే ఒప్పించడం ద్వారా లేదా అవసరమైతే బలవంతంగానైనా హిందూ సమూహంలోకి తిరిగి తీసుకురావాలని అనుకున్నాడు. హిందూ మహాసభ సైద్ధాంతిక సంతానం అయిన ఆర్ఎస్ఎస్, దాని ప్రారంభం నుండి హిందూ రాష్ట్ర నిర్మాణం పైనే పనిచేస్తోంది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మనం “నవభారత్” వైపు పోతున్నామా.. లేదు.. పొరుగువాడి మత ఆధారిత దేశాన్ని కాపీ చేస్తూ ‘న్యూ పాకిస్తాన్’ లాగా తయారవుతున్నాం. దేశంలో మతోన్మాద చర్యలు పెట్రేగిపోతున్నాయి. అల్ప సంఖ్యాకులపై, ముఖ్యంగా ముస్లిములపై, విష ప్రచారం పెరిగి పోతోంది.
లవ్ జిహాద్ నుంచి ఫుడ్ జిహాద్ దాకా..
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే సంకేతాత్మకంగా ముస్లింలను పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపుతాడు. వారిని బాబర్ సంతానం అని దూషిస్తారు.. వారి దేశభక్తిని నిరంతరం అనుమానిస్తుంటారు. వారి జీవనోపాధికి అంతరాయం కలిగిస్తారు. ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చివేస్తారు. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమిస్తే, అది లవ్ జిహాద్ అవుతుంది. వాళ్ల ఇళ్ళల్లో ఫ్రిజ్ ఉంటే, దానిలో గొడ్డు మాంసం ఉందో లేదో తనిఖీ చేస్తారు. ఒక పుకారు వ్యాపిస్తుంది. ముస్లింలపై హింస చెలరేగుతుంది. ఒక ముస్లిం దుకాణం పేరు హిందూ పేరును పోలి ఉండకూడదు.. ముస్లింలు దేశంలో ఉండొచ్చు. కానీ తమ దేశంలోనే ద్వితీయ పౌరులుగా మాత్రమే ఉండాలి.
ఈ అవార్డుకో గౌరవం ఉంది!
సావర్కర్ కల నెరవేరుతున్నట్లే కదా.. అవును, అందుకే భారతరత్నకు అర్హుడు. దేశం పేరును అధికారికంగా హిందూ రాష్ట్రంగా మార్చినప్పుడు, అవార్డు పేరును హిందూ రత్న అని మార్చవచ్చు. ఎందుకు వ్యర్ధమైన లౌకిక పరిభాషను పట్టుకు వేలాడాలి మరణానంతర అవార్డులను అనుమతించడానికి నియమాలను సవరించిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గాంధీకి భారతరత్న ఎప్పుడూ ఇవ్వలేదు.. 1992లో సుభాష్ చంద్రబోస్‌ను భారతరత్న అవార్డు గ్రహీతగా ప్రకటించారు, కానీ ఆయన కుటుంబం తిరస్కరించినందువల్ల, ఆయనకు గౌరవం దక్కలేదు. ఇక భగత్ సింగ్‌కు ఇచ్చే ప్రసక్తే లేదు.. కానీ ఎడాపెడా బ్రిటిష్ వారికి ఎడతెగని క్షమాభిక్ష పిటిషన్లు రాసిన “వీర్” సావర్కర్‌ను తప్పక గౌరవించాలి. నేడు భారతరత్న అవార్డుకున్న గౌరవం అలాంటిది. యథారాజా తథా పురస్కార౦.
లౌకికత్వాన్ని ఎవరూ సమాధి చేయలేరు..
గాంధీ హత్య లౌకిక భారతదేశాన్ని చంపడానికి చేసిన ప్రయత్నం. అది విఫలమైంది. భారతదేశం లౌకికంగానే- లోపభూయిష్టంగా, అసంపూర్ణంగానయినా నడిచింది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలలో లౌకిక భావాన్ని సమాధి చేయలేకపోయింది. అది 1,000 సంవత్సరాలలో కూడా విజయం సాధించలేదు. అయితే, ధబోల్కర్, పంసారే, గౌరి లంకేష్ లాగా మతతత్వ ఫాసిస్టులతో మన శక్తి మేరకు పోరాడకపోతే నిత్య జీవితంలో దీపక్ “మొహమ్మద్” లాగా ఎదిరించకపొతే, మనం కాషాయ సిద్ధాంతాన్ని సమూల౦గా ఓడించకపోతే, హిందూ రాష్ట్రం వాస్తవమవుతుంది. అప్పుడు, లౌకికవాదం తన సమాధి స్థలాన్ని వెతుక్కోవలసి ఉంటుంది. ఈ ఘోర పరిణామానికి మనం సిద్ధంగా ఉన్నామా లేకపోతే, ఈ మతతత్వ ఫాసిస్టులకు వ్యతిరేకంగా మహత్తర పోరాటాన్ని ప్రారంభి౦చాలి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు..
- విమల్






