- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ కాలేజీలకు.. పూర్వ వైభవం!
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ఉపాధ్యాయుడికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ఉపాధ్యాయుడికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అయితే, అటువంటి ఉపాధ్యాయులను తయారు చేసే బి.ఎడ్ కాలేజీల నిర్వహణ అధ్వానంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా బి.ఎడ్ కాలేజీలు నిర్వహించాలంటే కొన్ని నిబంధనలను పాటించాలి. అందుకు అనుగుణంగా భవనాలు, అర్హత కలిగిన సిబ్బంది వంటివి ఉండాలి. కానీ గత కొంత కాలంగా డైట్, బి.ఎడ్ కాలేజీల్లో అధ్యాపకులు అందుబాటులో లేకపోవడం వల్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు చేసే విద్యార్థులకు తరగతులు చెప్పేవారు లేకుండా పోయారు. కొన్ని పోస్టులను గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా డైట్, బి.ఎడ్ లెక్చరర్‌గా పదోన్నతులు కల్పించింది. ఇంకొన్ని చోట్ల గెస్ట్ లెక్చరర్‌లచే క్లాసులు చెప్పించింది. అయితే వారు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారు.. తాజాగా ప్రభు త్వం ప్రభుత్వ డైట్, బి.ఎడ్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం కోసం కసరత్తు చేస్తుంది. ఏటా వేల మంది విద్యార్థులు జాయిన్ అయ్యే ఈ కోర్సుల్లో ఇలా రెగ్యులర్ అధ్యాపకుల కోసం ప్రభుత్వం నియామక ప్రక్రియ గురించి ఆలోచించడం మంచి పరిణామం. నియామక పరీక్ష ద్వారా డైట్, బి.ఎడ్ లెక్చరర్ పోస్టులు భర్తీ అయితే అటు విద్యార్థులకు, ఇటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం డిప్యూటీ ఈఓ పోస్టులు కూడా భర్తీ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ మరింత పారదర్శకత పెరుగుతుంది.
-రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998






