ఆ ఊర్లో దళితులకు దూరంగా బతుకమ్మ!

by Ravi |   (  Updated:2025-09-16 00:45:28  IST  )

తెలంగాణలోని ఉత్పత్తి కులాలు, ప్రధానంగా వెనుకబడిన తరగతులుగా వర్గీకరించబడిన వారు సాంప్రదాయకంగా

ఆ ఊర్లో దళితులకు దూరంగా బతుకమ్మ!
X

తెలంగాణలోని ఉత్పత్తి కులాలు, ప్రధానంగా వెనుకబడిన తరగతులుగా వర్గీకరించబడిన వారు సాంప్రదాయకంగా బతుకమ్మ పండుగను జరుపుకునేవారు. కొంతకాలం క్రితం వరకు, కొన్ని ప్రదేశాలలో దళిత మహిళలు దీనిని విడిగా జరుపుకునేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ఊర్లల్లో వారి స్వంత స్థావరాలలో కూడా దీనిని జరుపుకోవడానికి అనుమతించడం లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పరిస్థితి కొంతవరకు మారినప్పటికీ, ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో దళితులు ఈ పండుగలో పాల్గొనడానికి ప్రయత్నించినప్పుడు వారిని దూరంగా ఉంచే సంఘటనలు ఇప్పటికీ మనం చూస్తున్నాము. సమానత్వం అన్ని రంగాల్లో రాణించినప్పుడే రిజర్వేషన్లు ఉండవు అని అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వేషన్ల విషయంలో తెలిపారు.. కానీ ఇక్కడ అది అమలు అవడం లేదు. శ్రావణ మాసంలో జరిగే బోనాల పండుగలోనూ వివక్షే చూపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామం ఉమ్మడి మోత్కూరు మండలంలోనే మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఈ గ్రామంలో కుల వివక్ష ఎక్కువ. నేటికీ ఈ గ్రామంలో దళితులకు బతుకమ్మ దూరమే.. గ్రామంలో సబ్బండ కులాలు బతుకమ్మ ఆడుతుంటే దళితులు బతుకమ్మ పేర్చడానికి అనుమతి లేదు. కేవలం నిలబడి చూడాల్సిందే.. ఈ గ్రామంలోని గ్రామదేవతల దేవాలయాలు ఒకే చోట ఉన్నాయి. అవన్నీ అభివృద్ధి చెందాయి. కానీ కేవలం దళితులు పూజించే పాపమ్మ దేవాలయం వివక్షకు గురై సంపూర్ణ నిర్మాణంలో గత 25 ఏళ్లుగా పై కప్పు లేకుండా నిర్లక్ష్యానికి గురై వివక్షకు నిదర్శనమైంది. మార్పు దిశగా అభ్యుదయవాదులు చేస్తున్న బహుజన బతుకమ్మలు ఈ గ్రామాన్ని కలుపుకొని బహుజనులందరితో దళితులు బతుకమ్మ ఆట పాటలతో వేయవలసిన అవకాశం బహుజన బతకమ్మ కల్పిస్తుందని ఆ గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు. ఈ గ్రామంలో ఎందరో విప్లవకారులు, కమ్యూనిస్టు వాదులు త్యాగం చేసిన చరిత్ర ఉన్నప్పటికీ ఈ దిశగా ఎవరు ఆలోచన చేయలేదని దళిత కాలనీ వాసుల ఆవేదన.

-ప్రవీణ్

98495 00383

Next Story