- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లయ తప్పుతున్న బతుకమ్మ..!
తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు బొడ్డెమ్మతో మొదలయి ఆశ్వయుజ శుక్ల దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో

తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు బొడ్డెమ్మతో మొదలయి ఆశ్వయుజ శుక్ల దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ పండుగ ఎంతో ముఖ్యమైనది. ప్రకృతిని ఆరాధించే జరుపుకునే పండుగ కోసం ఆడపడచులు ఎదురుచూస్తూ ఉంటారు. బతుకమ్మను వివిధ రకాలైనా పూలతో ముఖ్యంగా తంగేడు, గునుగ, బంతిపూలతో పేర్చి, గౌరమ్మ పూజించి లయ బద్ధంగా, పాటలతో ఆడుతూ చెరువు నీళ్లలో విడిచిపెట్టడంతో ప్రకృతిని ఆరాధించే సంప్రదాయమే గాకుండా లయబద్దంగా ఆడటం వలన మహిళల ఆరోగ్యంపై ప్రభావం పడటమే కాదు.. ఊర్లోని వారందరూ, కులాల భేదం లేకుండా ఒకే చోట చేరి ఆడుకునే పద్ధతే గాకుండా, ఆడ పడుచులను పుట్టింటికి తప్పనిసరిగా పిలుచుకుని, జరుపుకునే సంప్రదాయ పండుగ.
ప్రకృతిని ఆరాధించే పండుగ
బతుకమ్మ పాటలతో ఆడిన తర్వాత చెరువు దగ్గర గౌరమ్మ పూజించుకుని మహిళలు ఒకరి ఒకరు పసుపు కుంకుమలతో ప్రసాదం పంచుకోవడం ద్వారా తను మత్తయిదవతనం చల్లగా ఉండాలని, పరోక్షంగా భర్తల, కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరే పండుగ, వివిధ రకాలైన పూలతో పేర్చించిన బతుకమ్మను నీళ్లలో విడిచి పెట్టడం ద్వారా వర్షాకాలంలో నిండిన చెరువులోని నీరు కలుషితం కాకుండా దోహదపడుతుంది. ఈ రకంగా సంప్రదాయ పరంగా, శాస్త్రపరంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించడమే గాకుండా ప్రకృతిని ఆరాధించే పండుగ. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు బతుకమ్మ పండుగ జరుపుకునే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రాచుర్యం పొందడమే గాకుండా రాష్ట్ర సాధనలో తన వంతు పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టే ప్రభుత్వం, తొమ్మిది రోజుల పాటు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బతుకమ్మ ఉత్సవాలను జరుపుతూ వస్తోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పండుగ జరపడమే కాకుండా అందుకు తగిన నిధులు కేటాయించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం పట్ల ఉన్న గౌరవాన్ని తలపిస్తుంది.
దాండియా, డీజే సౌండ్ అవసరమా?
అయితే బతుకమ్మను జరుపుకోవడంతో, దానికి తగ్గట్టుగా లయ బద్ధంగా, రెండు చేతుల చప్పట్లతో ఆడుతూ, పురాణ గాథలను, కుటుంబ గాథలను, పెద్దవారు పాడు తుంటే మిగతా మహిళలు దాన్ని వల్లె వేస్తూ ఆడటం సంప్ర దాయం, కానీ ఇటీవల దానికి బదులుగా మన సంస్కృతి కాని దాండియా కోలాటాలు, డీజే సౌండ్‌తో తమ ఇష్టా రీతిన ముఖ్యంగా యువత ఆడటం పలు విమర్శలకు గురవు తోంది. బతుకమ్మలో ఇటువంటి ధోరణులు మన సంస్కృ తి, సంప్రదాయం కాదని, మంత్రివర్యులు సీతక్క చెప్పడం మంచి విషయం. ఇలాంటి ధోరణుల వలన అసలు పండుగ ఔన్నత్యం మరుగున పడుతుంది. అంతేకాక కేవలం అశ్వీయుజ మాసంలో జరుపుకునే ఈ పండుగను ఎప్పు డు పడితే అప్పుడు జరుపుకోవడం మంచి సంప్రదాయం కాదు.
స్త్రీల పండుగలో మగాళ్ల ఆటలేంటి?
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు బతుకమ్మను ఏ విధంగా జరుపుకోవాలనే సూచనలను ముందే జారీ చేయాలి. ప్రధానంగా దాండియా కోలాటం లాంటివి అందులో దూరకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలి. అంతేకాకుండా సంప్రదాయబద్దంగా జరిగే విధంగా జిల్లా అధికారులు పర్యవేక్షించాలి. అవసరమైతే రాష్ట్ర సాంస్కృతిక అధ్వర్యంలోని కళాకారులచే బతుకమ్మ ఆడే విధానాన్ని పాటలను ఉద్యోగస్తులకు, మహిళలకు ఇప్పించాలి. లేకుంటే ఎంతో సంప్రదాయకంగా జరుపుకునే బతుకమ్మ ఔన్నత్యం మరుగున పడే అవకాశం ఉంటుంది. పైగా మహిళలు ఆడుకునే జరుపుకునే పండగలలో మగవారు ఆడటం కూడా నిరోధించాలి.
-సురేష్ పోద్దార్
సంయుక్త కలెక్టర్ (విశ్రాంత)
80080 63605






