అతడొచ్చాడు..

by Disha Web Desk 13 |
అతడొచ్చాడు..
X

నీ దేశంలో నీవు పరాయివైతే

నీ దేశంలో నీవు బానిసవైతే

ప్రశ్నించడానికి ప్రక్షాళించడానికి

అతడొచ్చాడు

స్వలాభాలు స్వప్రయోజనాలు సవ్యంగా సాగే

సంఘాన్ని శిక్షించడానికి సమగ్ర సంస్కరణలతో

అతడొచ్చాడు

అణగారిన ఆకాంక్షలకు అనుగుణంగా

నేలకూలిన ఆశలకు ఆసరాగా

ఓటమి నుండి విజయ సోపానానికి చేరుస్తూ

అతడొచ్చాడు

అవమానాలు ఎదుర్కొని పరీక్షలకు నిలబడి

జీవిత సారాన్నంతా జాతికి అంకితం చేస్తానని

అతడొచ్చాడు

పదవులకంటే విలువలకి ప్రాణమిచ్చి

సైద్ధాంతిక నిబద్ధతతో అతడొచ్చాడు

బోయవాడు రత్నాకరుడై వాల్మీకిగా మారి

రామాయణం రాసాడు

ఎరుకలవాడు కృషితో ఏకలవ్యుడుగా నిలిసాడు

ఇతిహాసపాత్రలే చిరంజీవులైతే

ఈ సామాజిక ఆర్థిక రాజకీయ

న్యాయానికి రూపకర్తగా ధరిస్తే నిలిస్తే

కాలుష్యం కబళించని కాంతిపుంజంలా

ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిన మనోరంజంలా

అతడొచ్చాడు

- కోటం చంద్రశేఖర్ 9492043348



Next Story

Most Viewed