- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోధించని సబ్జెక్టులపై పరీక్ష.. సమంజసమేనా?"
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రస్తుత విధానంపై సర్వీస్ టీచర్లు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, పేపర్-2లో సబ్జెక్టుకు సంబంధం లేని ప్రశ్నలపై ఆందోళన, టెట్‌ను సబ్జెక్టుల వారీగా నిర్వహించాలన్న డిమాండ్, పరీక్షా విధానంలో అవసరమైన సంస్కరణలపై విశ్లేషణ..

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదే. అయితే ప్రస్తుతం ఆ ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కార ణంగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నా రు. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న సర్వీస్ టీచర్లు, తాము బోధించే సబ్జెక్టులకు సంబంధం లేని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి రావడం వల్ల టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణీత గడువులోగా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో వేలాది మంది ఉపాధ్యాయులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్, పరీక్షా విధానం తమ వృత్తి అవసరాలకు అనుగుణంగా లేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా టెట్ పేపర్-2పై ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. గణిత ఉపాధ్యాయులకు బయాలజీ, బయాలజీ ఉపాధ్యాయులకు ఉన్నత స్థాయి గణితం, సోషల్ టీచర్లకు భాషా అంశాలు, భాషా పండితులకు గణితం, సోషల్ వంటి ప్రశ్నలు అడగడం సమంజసం కాదని అంటున్నారు. ఇక దశాబ్దాలుగా బోధన చేస్తున్న ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని వారి అనుభవం కంటే సంబంధం లేని సిలబస్ ఆధారంగా అం చ నా వేయడం సరైందేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇటీవల నిర్వహించిన టెట్‌లో సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అందుకే టెట్‌ను డీఎస్సీ తరహాలో సబ్జెక్టుల వారీగా నిర్వహించాలని, బోధించే సబ్జె క్టుల నుంచే ఎక్కువ ప్రశ్నలు ఇవ్వాలని, భాషా పండితులకు ప్రత్యేక పేపర్ ప్రవేశపెట్టాలని, అర్హత మార్కుల విధానాన్ని సమీక్షించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అలాగే నిపుణుల కమి టీతో టెట్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా యి. టెట్ ఉద్దేశం నాణ్యమైన బోధనను నిర్ధారించడమే అయినప్పటికీ, పరీక్షా విధానం బోధనా వాస్తవాలకు దగ్గరగా ఉండేలా సమతుల్య మార్పులు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-రావుల రాజేశం
77801 85674






