- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరచిపోయిన మహానటుడి ప్రస్థానానికి అవార్డు!
తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ నటుడు పైడి జైరాజ్ జీవిత ప్రయాణం, భారతీయ సినిమా ప్రారంభ దశలో ఆయన చేసిన సేవలు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచిన ‘పైడి జైరాజ్ ప్రస్థానం’ గురించి విశ్లేషణ.

కరీంనగర్ గ్రామం నుండి ప్రారంభమైన పైడి జైరాజ్ ప్రయాణం భారత స్థాయికి చేరి చివరకు భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన జీవితం కేవలం ఒక నటుడి విజయగాథ కాదు.. భారతీయ సినిమా ప్రారంభ దశలో కళాకారులు ఎదుర్కొన్న పోరాటానికి అది ప్రతీక. ఈ డాక్యుమెంటరీ చేయకపోతే ఎవరికి తెలుస్తుంది ఆయన గురించి? ఏడు దశాబ్దాలపాటు సినీ రంగంలో ఉండి మూడు తరాల నటీ నటులతోనూ మూకీ, టాకీ సినిమాలతో పాటు టీవీల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన తెలంగాణ బిడ్డ జైరాజ్‌ను తెలంగాణా సమాజం గుర్తించలేదు.. సినిమా వాళ్లేమో తెలుగులో నటించలేదు కదా, బాంబే వెళ్లిపోయాడని అన్నారు. కానీ పైడి జైరాజ్ బాంబే వెళ్లడానికి గల నేపథ్యాన్ని తెలుగు ప్రభుత్వాలు కానీ, సినిమా రంగం కానీ ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అలా దశాబ్దాల పాటు కనీసం స్మరించుకోని తెలంగా ణా సినీ తేజం పైడి జైరాజ్. ఆయన హిందీ సినిమా రంగం భూమికగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు గడించి 70ఏళ్ల పాటు సినిమా రంగంలో వెలుగొందారు. 1931 ‘ఆలం ఆరా’తో భారతీయ సినిమా మాటలు నేర్వకముందే మూకీ యుగంలోనే తన ముద్రను నిలిపిన పైడి జైరాజ్ తెలంగాణ వాడు కావడంతో తెలుగు సినిమా ఆయనను అంగీకరించడానికి, ఆమోదించడానికి సిద్ధం కాలేకపోయింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1980లో జైరాజ్‌కు భారతదేశంలోని అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అందజేశారు. జైరాజ్ నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమా రంగంలో కృషి చేసాడు. కాలగమనంలో ఇటువంటి మహానటుల కథలు మరుగున పడిపోతాయి. కానీ వాటిని వెలికితీసే వారు కూడా ఉంటా రు. అటువంటి ప్రయత్నమే ‘పైడి జైరాజ్ ప్రస్థానం’ డా క్యూమెంటరీ..! ఈ డాక్యుమెంటరీ తెలంగాణ గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ డాక్యమెంటరీ చిత్రంగా ఎంపికైంది. ఈ అవార్డును నిర్మాత పొన్నం రవిచంద్ర, డైరెక్టర్ కత్తి చేతన్.. అందుకున్నారు.
- డా. కత్తి పద్మారావు






