- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకాశయానంలో అదానీ ఆధిపత్యం
అదానీ సమూహం ఆపరేట్ చేస్తున్న విమానాశ్రయాలకు ట్రాఫిక్‌ను పెంచాలన్న లక్ష్యంతో విదేశీ విమాన సంస్థలకు ఎక్కువ ఎగుమతి హక్కులు అనే కోరికను, మోదీ ప్రభుత్వం ఎదుట అదానీ గ్రూప్ ఒక వ్యూహాత్మక డిమాండ్‌ను పెట్టింది.

అదానీ సమూహం ఆపరేట్ చేస్తున్న విమానాశ్రయాలకు ట్రాఫిక్‌ను పెంచాలన్న లక్ష్యంతో విదేశీ విమాన సంస్థలకు ఎక్కువ ఎగుమతి హక్కులు అనే కోరికను, మోదీ ప్రభుత్వం ఎదుట అదానీ గ్రూప్ ఒక వ్యూహాత్మక డిమాండ్‌ను పెట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ వంటి వాయుయాన సంస్థలకు మరిన్ని సీట్లను విడుదల చేయాలని, ఇందులో యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను వేగవంతం చేయాలని అదానీ గ్రూప్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇది భారతదేశానికి చెందిన రెండు అతి పెద్ద ఎయిర్లైన్స్ సంస్థలు, విమానాశ్రయాలు పెట్టుబడిదారుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడటానికి దారితీసింది. మూడు మూల శక్తుల మధ్య ఘర్షణను పరిశీలిద్దాం.
అదానీ గ్రూప్
భారతదేశంలోని ఎనిమిది ప్రైవేట్ విమానాశ్రయాలను ఆపరేట్ చేస్తూ, 2030 నాటికి టెర్మినల్స్, రన్వేలు, ప్రయాణికుల సదుపాయాల కోసం 11.1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఈ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పెద్ద పెట్టుబడులకు సరిపడా ట్రాఫిక్ లభించాలని ఆసక్తి కలిగి ఉంది. ప్రయాణికులకు మరిన్ని ప్రత్యామ్నాయాలు, సౌకర్యాలు అందించడం భారతీయ విమానాశ్రయాలను ప్రపంచస్థాయి హబ్బులుగా మార్చడానికి కీలకంగా పని చేస్తామ''ని అదానీ గ్రూప్ చెప్పుతుంది. ఇది కేవలం భారతీయ ఎయిర్లైన్స్‌కు పోటీకి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉండకూడదు అని అదానీ గ్రూప్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. విమానాశ్రయాల సామర్థ్యాన్ని వృథా చేయడం నేరపూరితమైన వ్యర్థంగా వారు భావిస్తున్నారు.
ఎయిర్ ఇండియా, ఇండిగో
వారి వ్యాపార ప్రయోజనాల కోసం విదేశీ ఎయిర్లైన్స్ ముందుకు రాకుండా కాపాడుకోవాలని ఇవి ఆసక్తి కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి పశ్చిమ ఆసియా ఎయిర్లైన్స్, వారి ప్రభుత్వాల నుంచి అపారమైన నగదు మద్దతు, రాయితీలతో పోటీ చేస్తే, అది అన్యాయమైన పోటీగా భావిస్తున్నాయి. విదేశీ ఎయిర్లైన్స్ తీసుకెళ్లే వారికన్నా 70 శాతం కంటే ఎక్కువగా భారతీయ ప్రయాణికులు ఇతర దేశాలకు వెళ్లేవారని, ఆ ఆదాయం భారత సంస్థలకు దక్కకుండా పోతుందని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ వాదించారు.
కేంద్ర ప్రభుత్వం
దేశీయ ఎయిర్లైన్స్ పెట్టుబడులను కాపాడటం, అభివృద్ధి చేయడం, విమానాశ్రయాల పెట్టుబడులను వృథా చేయకుండా చూసుకోవడం, ప్రయాణికులకు సరసమైన ధరలను కొనసాగించడం వంటి బహుళ లక్ష్యాలను సమతుల్యం చేయాల్సి ఉంది. 2016 జాతీయ పౌర విమానయాన విధానం, భారతీయ ఎయిర్లైన్స్ తమ ఎగుమతి హక్కులలో 80 శాతం ఉపయోగించిన తర్వాతే అదనపు హక్కులు మంజూరు చేయాలని నియమం చేస్తుంది.
నివేదిక ఏం చెపుతోంది
ఈ చర్చ ఒక సాధారణ వ్యాపార వివాదం కంటే ఎక్కువ. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం, పెద్ద వ్యాపార సంస్థలు మరియు జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల మధ్య సంక్లిష్ట సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. ఈ వ్యాజ్యంలో, ప్రభుత్వం ఏ పక్షానికి మద్దతు ఇస్తుందో తెలియదు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, ఆర్ధిక పరిమాణామాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తన మిత్రుడు అయిన అదానీ గ్రూప్ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే భారత దేశంలో అన్ని ఆర్థిక వనరులపై, ప్రకృతి సంపదపై ఆధిపత్యం చెలాయించటానికి, అదానీ గ్రూప్ వేగవంతమైన అభివృద్ధి వెనుక అండగా నిలబడింది ప్రధాన మంత్రి హోదాలో పనిచేస్తున్న మోదీ కనుక సహజంగానే ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది. అదానీ పురోభివృద్ధి కోసం ఎంతకైనా తెగించే లక్షణం మోదీకి ఉన్నట్లు గత 11 ఏళ్ళ చరిత్ర సాక్ష్యం చెబుతుంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్.
98493 28496






