ఒక విజయం.. ఓ గర్వభంగం

by Ravi |   (  Updated:2025-06-25 00:30:28  IST  )

ప్రపంచవ్యాప్తంగా తొత్తు సర్కార్ల అండదండలతో అమెరికా కీలక భౌగోళిక ప్రాంతాల్లో తన సైనిక స్థావరాల్ని నిర్మించింది అమెరికా

ఒక విజయం.. ఓ గర్వభంగం
X

ప్రపంచవ్యాప్తంగా తొత్తు సర్కార్ల అండదండలతో అమెరికా కీలక భౌగోళిక ప్రాంతాల్లో తన సైనిక స్థావరాల్ని నిర్మించింది అమెరికా. వాటిలో కెల్లా కీలకమైనదే చమురు సంపన్న గల్ఫ్ ప్రాం తం. వాటిలో అన్నిటికంటే అతి ముఖ్యమైనదే ఖతార్ ఎయిర్ బేస్! దాని మీద సోమవారం రాత్రి అత్యంత సాహసోపేత దాడిని ఇరాన్ చేసింది. ఆ శుభవార్తతో అరబ్ దేశాల యువత పారవశ్యంలో మునిగింది. ముఖ్యంగా ఇరాన్ ప్రజలు రోడ్డెక్కి సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. రాత్రికి రాత్రే టెహ్రాన్ నగర వీధుల్ని జన సందోహం ముంచెత్తింది. గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా సైనిక స్థావరాల్ని తరిమివేసే వరకూ సాగే పోరాటానికి ఇది ఆరంభంగా భావిస్తూ ఉద్వేగ భరితంగా స్త్రీల తో సహా వీధుల్లోకి వచ్చి సైనికులకు వీర తిలకం దిద్దారు..

మన భారతీయులకు కూడా సుదీర్ఘ స్వతంత్ర పోరాట చరిత్ర ఉంది. ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకొని అమెరికా వెళ్లిన మన భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు బేడీలు వేసి తన సైనిక విమానాలలో పశువుల్లా ట్రంప్ సర్కార్ తరలించిన విషాధ సంఘటన మన మనసులను వేధిస్తూనే ఉంది. 56 అంగుళాల ఛాతీ గల మన సోకాల్డ్ పాలకులు ట్రంప్ ఎదుట పోషించిన గంగిరెద్దు పాత్ర ప్రపంచ యవనిక మీద మన భారతదేశ ఆత్మ గౌరవాన్ని ఘోరంగా మంటగలిపింది. మనం అందుకు మానసికంగా గాయ పడ్డాం. ఇప్పుడు అమెరికాపై ప్రతీకార దాడి చేసిన ఇరాన్ సర్కార్ సాహసోపేత దాడికి మద్ద తుగా ఇరాన్ ప్రజానీకం స్వేచ్ఛా ప్రియులుగా రోడ్లెక్కి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. స్వతంత్ర పిపాసులుగా, స్వేచ్ఛా ప్రియులుగా పరతంత్ర వలసపాలనపై పోరాడిన సుదీర్ఘ చరిత్ర మన భారతీయులకు కూడా ఉంది. ఇరాన్ ప్రజల ఆనందంలో మనం కూడా మానసిక భాగస్వాములం అవుదాం.

-పి ప్రసాద్ (పిపి)

94907 00715

Next Story