- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా వ్యవస్థకు మహర్దశ!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని విద్యారంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నదనడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి రాగానే పాఠశాలకు ఉచిత కరెంటుతో పాటు, తెలంగాణ మోడల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు స్వీకారం చుట్టడం, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మౌలిక వసతులను సమకూరుస్తుండటం ముదావహం.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని విద్యారంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నదనడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి రాగానే పాఠశాలకు ఉచిత కరెంటుతో పాటు, తెలంగాణ మోడల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు స్వీకారం చుట్టడం, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మౌలిక వసతులను సమకూరుస్తుండటం ముదావహం.
సాయంత్రం వేళల్లోనూ అల్పాహారం..
అధికారంలోకి వచ్చీరాగానే ఉపాధ్యాయులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న పదోన్నతుల, బదిలీల ప్రక్రియలను విజయవంతంగా పూర్తిచేయడం, ఉపాధ్యాయుల హాజరు కోసం ముఖ గుర్తింపు హాజరును ప్రవేశ పెట్టడం వంటి నిర్ణయాలతో విద్యావ్యవస్థను అగ్రస్థానంలో నిలబెట్టడానికి చేస్తున్న కృషిగా అభివర్ణించవచ్చును. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, రాగి జావ, ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించడం హర్షించదగ్గ పరిణామం.
విద్యార్థులకు భారీగా కిట్ల సరఫరా..
స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులను అందించడం జరుగుతూ వస్తున్నది. కానీ రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు టై, బెల్టు, షూస్, స్టేషనరీ ఐటమ్స్ ఇతరత్రా అన్ని కలిపి 22 అంశాలతో కూడిన కిట్‌ను అందిస్తామని ప్రకటించడం అందుకు తగ్గ ప్రణాళికలను రూపొందించమని అధికారులను ఆదేశించడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రుల, ఇటు విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించాయి.
నాణ్యతపై దృష్టి అవశ్యం!
అత్యధిక మానవ వనరులు కలిగిన దేశాన్ని అత్యధిక నైపుణ్యాలు కలిగిన దేశంగా రూపుదిద్దాలంటే కేటాయింపులు అధికంగా జరగాలి. ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఆ దిశగా కొంత ప్రయత్నం చేస్తుండడం ముదావహం. ఒకవైపు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పేరుతో, మన ఊరు మన బడి పేరుతో బడులు బాగైన సందర్భంలో ఇక ప్రవేశాలు, నాణ్యతపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కనుక 22 వస్తువులతో కూడిన కిట్ ప్రభుత్వ సెక్టారులో చదువుతున్న పిల్లలకి ఈ పథకం వలన లబ్ది చేకూరుతుందని సగటు విద్యాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వరప్రదాయనిగా ప్రభుత్వ కిట్!
రెండు దశాబ్దాల అనుభవం కలిగిన ఒక ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు రంగు పెన్సిల్లు, స్కెచ్ పెన్నులు, బ్యాగులు ఇతర సామాగ్రి లేక వారి వర్క్ బుక్కులు పూర్తి చేయలేని సందర్భాలు చూస్తున్నా.. ఎక్కడైనా పిల్లలకి అలాంటి అవసరాలు ఏర్పడితే టీచర్లు కొనిస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఈ కిట్ పంపిణీ వలన వారిలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని నమ్మకం ఉంది. అలాగే డ్రాయింగ్ ఆర్ట్ క్రాఫ్ట్ వంటి కళల పట్ల వారిలో ఆసక్తి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యను పెంచితే, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో తరగతికొక ఉపాధ్యాయ నియామకం చేసినట్లయితే బడుల్లో సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బదిలీ పదోన్నతులు చేసి, నియామకాలు చేసిన ప్రభుత్వం విద్య పట్ల కాస్త సానుకూలంగా కనిపిస్తున్నది. ఇది విద్యారంగానికి మంచి సమయంగా మారితే రాష్ట్ర ప్రజలకు అంతకన్నా కావలసింది ఏముంది? అందరికీ ఆదర్శంగా మన రాష్ట్ర విధానాలు ఉండాలని ఆశిస్తూ, 22 వస్తువులతో కూడిన కిట్ ఓ మంచి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరుకుందాం.
-సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS
90006 74747






