- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ రంగానికి నవశకం!
తెలంగాణలో వ్యవసాయ రంగానికి నవశకం మొదలైంది. రెండేళ్లుగా రైతులకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోంది. గత ప్రభుత్వం వలె పంట సాయం చేసి చేతులు దులుపుకోకుండా అన్ని విధాలుగా ఆదుకొంటుంది.

తెలంగాణలో వ్యవసాయ రంగానికి నవశకం మొదలైంది. రెండేళ్లుగా రైతులకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోంది. గత ప్రభుత్వం వలె పంట సాయం చేసి చేతులు దులుపుకోకుండా అన్ని విధాలుగా ఆదుకొంటుంది. రుణమాఫీ మొదలుకుంటే బోనస్ వరకు.. ఫామ్ మెకనైజే షన్ నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వ్యవసాయానికి ₹1.15 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించింది. అలాగే ‘రైతు భరోసా’ కింద ఎకరాకు ₹6,000 చొప్పున రెండు సీజన్లకు పెట్టుబడి సాయం అందిస్తోంది. సన్న వడ్లకు క్వింటాలుకు ₹500 బోనస్ ప్రకటించి వరి రైతులను ప్రోత్సహిస్తోంది. అలాగే ఫామ్ మెకనైజేషన్ పథకాన్ని పునరుద్ధరించి సబ్సిడీపై యంత్రాలు అందిస్తోంది.
వ్యవసాయ రంగంలో టెక్నాలజీ..
వ్యవసాయ రంగానికి శాస్త్రసాంకేతికను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రైతులు పంటసాగులో కూలీలను తగ్గించుకోడానికి ట్రాక్టర్, హార్వెస్టర్స్, కలుపు యంత్రాలను వినియోగిస్తున్నారు.. ఇక ఫెస్టిసైడ్స్ చల్లడానికి డ్రోన్లు సైతం వాడుతున్నారు. వీటికి తోడు ప్రభుత్వం కొత్తగా డిజిటల్ అగ్రికల్చర్ విధానాన్ని కూడా తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్టు కింద రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఈ డిజిటల్ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు లేకుండానే ఐవోటీ సెన్సర్లు, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సాగు చేస్తే ప్రయత్నం చేస్తున్నారు.. దీనికోసం ప్రత్యేకంగా స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక 2030-2035 వరకు మన పంట పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవ రహిత ట్రాక్టర్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.
సాంకేతికతను వినియోగిస్తూ..
2047 వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్ లక్ష్యాల్లో వ్యవసాయం కీలక రంగంగా ఉంది. భవిష్యత్ వ్యవసాయం అంత ఏఐ ఆధారిత సాంకేతికత పైనే ఆధారపడనుంది. టెక్నాలజీ వినియోగంలో భాగంగానే యూరియా బుకింగ్ కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు క్యూ లైన్‌లో నిలబడకుండా ఇంటివద్దనే ఉండి.. యూరియాను బుక్ చేసుకుంటున్నారు.. ఇదే తరహాలో ఫామ్ యాప్‌ను తీసుకొచ్చే ఆలోచనలో వ్యవసాయ శాఖ ఉంది. ఓలా, ఉబర్ టాక్సి తరహాలోనే ఈ యాప్ పనిచేయనుంది. రైతు కావాల్సిన యత్ర పరికరాలు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే.. వారు వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. మరోవైపు వ్యవసాయ భూములను శాటిలైట్ సర్వే ద్వారా లెక్కిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలు తెలుసుకోడానికి ప్రభుత్వానికి ఈ సర్వే దోహద పడనుంది.
రైతులకు మేలు చేస్తున్న కమిషన్..
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు కమిషన్‌ను ఏర్పాటు చేశారు.. పంజాబ్ తర్వాత మన రాష్ట్రంలోనే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఉంది. ఈ కమిషన్ రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తుంది. కమిషన్ ఏర్పాటైన ఏడాది కాలంలోనే క్షేత్రస్థాయి పర్యటనలు, సమీక్ష, సమావేశాలు నిర్వహించింది. అంతేకాదు ఇతర రాష్ట్రాలైన హర్యానా, కేరళ, మహారాష్ట్రలో పర్యటించి అక్కడ అమలవుతున్న విత్తన చట్టాలు, సాగు, మార్కెట్, కౌలు రైతు విధానాలపై అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి సూచనలు, నివేదికలు ఇచ్చింది. ఇక ములుగు, గద్వాల్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలో విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు ప్రైవేట్ విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం వచ్చేలా కృషి చేసింది. ఉద్యానవన, సాంప్రదాయ పంటల సాగు పెంచేలా చర్యలు చేపడుతూ, రైతుల సంక్షేమం కోసం అహర్ని శలు కమిషన్ శ్రమిస్తుంది.
విత్తనం రైతు హక్కు!
గత పదేళ్లుగా నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు.. దీనికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో విత్తన చట్టం తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ చట్టం అమలైతే రైతుల విత్తన హక్కు రక్షితమవుతుంది. అదే సమయంలో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహిస్తోంది. తృణధాన్యాలు, పప్పుదినుసులు సాగు చేసే రైతులకు ఆర్థిక సాయం కూడా అందించనుంది. గత పదేండ్లలో కేంద్రమంత్రి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేని కారణంగా రైతులకు సంక్షేమ పథకాలు రాకుండా పోయాయి.. కానీ ప్రస్తుత వచ్చే నిధులు, సంక్షేమ పథకాల అమలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడూ అధికా రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయిస్తుంది. ఇన్నోవేటివ్ ఆలోచనలకూ సైతం పెద్ద పీట వేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికే కాదు వ్యవసాయ విద్యకు సైతం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి జిల్లాకో అగ్రి కల్చర్ కాలేజీని ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యను అభ్యసించే విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.
- రాజు కంచ
99638 01882






