- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత కార్మిక చట్టాలకు కొత్త శకం.. శతాబ్దపు పెద్ద సంస్కరణ
భారతదేశంలో శ్రామిక చట్టాలకు కొత్త శకం ఆరంభమైంది. కేవలం చారిత్రక సంస్కరణ మాత్రమే కాదు, దేశంలోని ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని, భద్రతను కల్పించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.

భారతదేశంలో శ్రామిక చట్టాలకు కొత్త శకం ఆరంభమైంది. కేవలం చారిత్రక సంస్కరణ మాత్రమే కాదు, దేశంలోని ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని, భద్రతను కల్పించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. నూతన కార్మిక చట్టాలు దేశాభివృద్దికి బాటలు వేసే సంస్కరణలు. దేశ కార్మిక చట్టాల చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలుస్తుంది.
సరళత, పారదర్శకత, సమర్ధత, కార్మికుల సంక్షేమానికి నాలుగు నూతన కార్మిక చట్టాలు దోహదపడతాయి. అందరికీ సాంఘిక భద్రత, అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫార్మ్ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందే అవకాశం లభించింది.
40 కోట్ల మందికి కనీస వేతనం..
దేశంలోని 40 కోట్ల మందికి కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలను లభించ నున్నాయి. నూతన కార్మిక చట్టాలతో పరిశ్రమలకు సరళీకృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారు. అంతేకాకుండా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, తదితర అంశాలు ఈ చట్టాలతో మెరుగైన పద్దతిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టాలు కాగితాలపైనే కాకుండా కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకు వస్తాయి. 29 పాత కార్మిక చట్టాలను సరళతరం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంఘటిత, అసం ఘటిత రంగాల్లోని లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయో జనాలకు హామీ లభిస్తున్నది.
వందేళ్లుగా అవే చట్టాలు.. మార్పు తథ్యం!
తాజా కోడ్‌లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్ కేంద్రాలు సహా అన్ని చోట్లా దేశవ్యాప్తంగా ఈఎస్‌ఐసీ సౌకర్యం కల్పిం చడం, సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయడం, కార్మికుల సంరక్షణను బలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతో పాటు అంతర్జాతీయంగా అనుసంధానించవచ్చు. మనదేశంలో 1930- 50 మధ్య రూపొందించిన కార్మిక చట్టాలే నేటికీ అమలులో ఉన్నాయి. ప్రస్తుత తరానికి ఆ చట్టాలు సరిపోవనే ఆందోళనలు ఉన్న సంగతి విదితమే. కొత్త కొత్త సమస్యలను అధిగమించేందుకు నూతన కార్మిక కోడ్‌లను కేంద్రం రూపొందించడం ద్వారా కార్మికులకు ఎంతో మేలు చేసింది.
29 కార్మిక చట్టాల హేతుబద్ధీకరణ..
ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేడర్ కోడ్‌లను ప్రకటించింది. వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రతా కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్- 2020 ఇందులో ఉన్నాయి. ఇవి నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి అన్ని రంగాలకూ వర్తించనున్నాయని.. కార్మికుల భద్రత మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికే కాక భద్రత, అదనపు ప్రయోజనాలు లభిస్తాయి అని చెబుతున్నారు.
కార్మికులకు వెసులుబాటు..
కొత్త కార్మిక నియమావళి ప్రకారం అతిపెద్ద మార్పులలో ఒకటి రోజువారీ పని పరిస్థితులు, ఉద్యోగులు ఎంతకాలం పని చేస్తారు, వారు ఎప్పుడు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు, వారు ఎంత ఓవర్ టైం తీసుకోవచ్చు, వారు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలకు అర్హులు లాంటివి నిర్ణయి స్తుంది. ఇప్పటివరకు, ఉద్యోగులు వార్షిక వేతనంతో కూడిన సెలవుకు అర్హత సాధించడానికి ముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో 240 పని దినాలను పూర్తి చేయాల్సి ఉండేది. కొత్త కోడ్‌లు ఆ అవసరాన్ని 180 రోజులకు తగ్గించాయి. అంటే ఇప్పుడు ఒక కార్మికుడు ఏడాదిలో చాలా ముందుగానే సెలవుకు అర్హుడు అవుతాడు. ఇది తయారీ, వస్త్రాలు, రిటైల్, నిర్మాణం, హాజరు నియమాలు సాంప్ర దాయకంగా కఠినంగా ఉండే ఇతర రంగాలలోని వారికి పెద్ద మార్పు అని చెప్పవచ్చు.
ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీ..
కొత్త కోడ్‌ల ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు పని చేయాలనే నియమం అలానే ఉంటుంది. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చనేది మాత్రం మారుతుంది. దీనిని వారంలో నాలుగు రోజులు 12 గంటలు, వారంలో దాదాపు 9.5 గంటలు ఐదు రోజులు, వారంలో రోజుకు ఎనిమిది గంటలు, ఆరు రోజులు కింద విభజించుకోవచ్చు. దీంతో పాటూ ఓవర్ టైమ్ పరిమితిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పరిమితులను నిర్ణయించుకోవచ్చు. కొత్త కోడ్‌లలో మరో ప్రధాన మార్పు.. ఆరోగ్యం, వైద్య కవరేజ్. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఉద్యోగికి ఇప్పుడు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీ లభిస్తుంది. ముఖ్యంగా, తోటల కార్మికు లకు ఇప్పుడు గతంలో ఒకే విధంగా అందుబాటులో లేని ESIC వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ప్రతి కార్మికుడికీ గౌరవం..
ప్రతి కార్మికుడికీ గౌరవం కల్పించాలనే ఎన్డీయే సర్కారు హామీతో కొత్త కార్మిక స్మృతులు దేశంలో అమల్లోకి వచ్చాయి. ఈ కోడ్‌లతో కార్మికులందరికీ కనీస వేతనాలు లభిస్తాయి, యువతకు నియామక పత్రాలు అందుతాయి, మహిళలకు సమాన వేతనాలు, గౌరవం లభిస్తాయి, 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది, ఫిక్స్‌డ్ టెర్మ్ ఉద్యోగులకు ఏడాది పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ వంటివి దక్కుతాయి. ఈ సంస్కరణలు సాధారణ మార్పులు కాదు.. కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్య. స్వయం సమృద్ధి భారత్ దిశగా కీలక ముందడుగు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌గా నిలవాలన్న లక్ష్యానికి ఊతం అని చెప్పడంలో సందేహం లేదు.
- వాసంశెట్టి సుభాష్
కార్మిక శాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం






