ఉద్యోగులను కనికరించిన బడ్జెట్!

by Ravi |   (  Updated:2025-02-02 00:45:57  IST  )

కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్డెట్‌ కేటాయింపుల్లో వేతన జీవులకు సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనలపై

ఉద్యోగులను కనికరించిన బడ్జెట్!
X

కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్డెట్‌ కేటాయింపుల్లో వేతన జీవులకు సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనలపై ఊరట కలిగించే అంశాలు ఆర్థిక మంత్రి ప్రకటించారు. జీవన వ్యయం, ధరల సూచిక, ద్రవ్యోల్బనం ఆధారంగా పన్నుల స్లాబులు మారుతాయని ఎదురుచూసిన ఉద్యోగ వర్గానికి తీపి కబురు అందింది. ఆదాయ పన్ను నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

జీవన వ్యయం పెరగడంతో కాలానుగుణంగా సంపాదన రేటు పెరిగింది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ రేటు పెరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా ప్రత్యక్ష పన్నుల స్లాబులు, రేట్లు మారాల్సి ఉంది. దీనిని ఆధారంగా చేసుకుని ఆశించిన రీతిలో కంటే ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నవి. ఆదాయపు వనరులు పెరిగినందున స్లాబుల వ్యాప్తి పెంచి, పన్నుల రేట్లను సమీక్షించాల్సి ఉందన్న ఉద్యోగుల ఆశలను కేంద్రం పట్టించుకుంది.

ప్రస్తుత పాత పన్ను విధానం..

స్టాండర్డ్ డిడక్షన్ 50,000 పన్నులేని పరి మితి రెండున్నర లక్ష ఐదు లక్షల వరకు ఐదు శాతం, 10 లక్షల వరకు 20 శా తం, పది లక్షల నుండి 30 శాతం పన్ను విధిస్తున్నారు. దీంట్లో సెక్షన్ 80సి కింద ₹1,50,000 పొదుపుల నుండి తగ్గిస్తారు. సెక్షన్ 24 బి, సెక్షన్ 80ఈఈ, సెక్షన్ 80ఈఈఎ ప్రకారం రెండు లక్షలు, యాభై వేలు, ఒకటన్నర లక్ష చొప్పున గృహ రుణ వడ్డీ మినహాయింపు ఇస్తారు. అసలు సెక్షన్ 80 సి కింద తగ్గిస్తారు.

ప్రస్తుత కొత్త పన్ను విధానం..

స్టాండర్డ్ డిటెక్షన్ 75000 పన్ను రిబేట్‌తో కలిపి పన్ను లేని పరిమితి ఏడు లక్షలు వరకు, రూ. 7 లక్షల నుండి పది లక్షల వరకు 10 శాతం, పది లక్షల నుండి 12 లక్షల వరకు పదిహేను శాతం 12 లక్షలు నుండి 15 లక్షల వరకు వరకు 20 శాతం, 15 లక్షలు ఆ పైబడిన ఆదాయంపై 30% పన్ను విధిస్తారు. దీనిలో ఎటువంటి పొదుపులు ఇతర తగ్గింపులు ఉండవు.

మారిన స్లాబుల ప్రకారం..

ఇప్పటివరకు అమలులో ఉన్న కొత్త పన్ను విధానంలో 7.75 లక్షల వరకు పన్ను పూర్తిస్థాయిలో మినహాయింపు ఉండేది. కానీ 2025- 26 ఆర్థిక సంవత్సరానికి మారిన స్లాబుల విధానం ప్రకారం, రూ.0-4 లక్షలు - సున్నా, రూ.4-8 లక్షలు - 5%, రూ.8-12 లక్షలు - 10%, రూ.12-16 లక్షలు - 15%, రూ.16-20 లక్షలు - 20%, రూ.20-24 లక్షలు - 25%, రూ.24 లక్షల పైన 30 శాతం పన్ను విధించనున్నారు. కేంద్రం 12 లక్షల పన్ను రిబేట్ ప్రకటించింది. అంటే స్టాండర్డ్ డిడక్షన్ 75 వేలతో కలుపుకొని 12 లక్షల 75 వేల ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో మధ్యతరగతి ఉద్యోగులకు భారీస్థాయి ఉపశమనం కలిగింది. గత 25 సంవత్సరాలుగా మారని ఆదాయపు పన్ను నిబంధనలను ఈ సారి మార్చింది. అయితే దీన్ని కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంచనుంది. కావున ఎటువంటి మినహాయింపులు ఇక్కడ వర్తించవు. అంటే సెక్షన్ 80సి, 24బి, 80 ఈఈ, 80 ఈఈఎ, ఇతరముల నుండి మూలవేతనంలో తగ్గించే పొదుపులు, గృహ రుణాల వడ్డీ -అసలు, వైద్య ఖర్చులు, దానాలు మొదలగు... పైకాలు ఇకపై స్వస్తి పలికినట్లే. ప్రత్యక్ష పన్నుల ఆదాయపు చట్టం 1961లో వ్యవస్థీకరణం అయినప్పటికీ ఆదాయ వ్యయాల నైష్పత్తికం మేరకు మార్పులు జరగలేదు. ఇది ప్రస్తుతం జరిగినట్లుగా తెలుస్తుంది.

మారిన పన్ను నిబంధనలు మొత్తం ఆదాయంపై లెక్కించడం జరుగుతుంది. దీనివల్ల పొదుపుల పట్ల నిరాధారణ పెరిగే అవకాశం ఉంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించే రుణాలపట్ల నిరాసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇప్పట్లో సీపీఎస్ రద్దు అయ్యే అవకాశం లేనందున ఆ స్కీంకు చెల్లించే మొత్తాలకు పన్ను మినహాయింపు ఉండదు. కావున కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచించి పొదుపులకు సీపీఎస్ మొత్తాలకు గృహానికి సంబంధించి వడ్డీ, అసలుకు పన్ను నుండి మినహాయింపు ఇస్తే మరింతగా పన్ను చెల్లింపుదారుల శాతం పెరుగుతుంది.

సి.వి ప్రసాద్

రాష్ట్ర అధ్యక్షులు, ఏపీటిఎఫ్

90590 76177

Next Story