ప్రస్తుత డిమాండ్ స్థిరంగా కొనసాగకపోవచ్చు

by  |
ప్రస్తుత డిమాండ్ స్థిరంగా కొనసాగకపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో డిమాండ్ భారీగా పుంజుకుందని, అయితే, ఈ డిమాండ్ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. జీఎస్టీ సేకరణలతో పాటు పలు సూచీలు అక్టోబర్ నుంచి కోలుకుంటున్నాయి. ఈ పరిణామాలు చాలామంది విశ్లేషకులు ఆర్ర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను సవరించడానికి దారితీసిందని ఇక్రా పేర్కొంది.

‘అక్టోబర్‌లో వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరగడం వల్ల వచ్చిన వృద్ధిని రికవరీగా భావించడం అతిశయోక్తి అవుతుందని, పండుగ సీజన్ తర్వాత ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగకపోవచ్చని’ ఇక్రా ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ అదితి నాయర్ చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఊహించిన సంకోచాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ప్రభుత్వం వ్యయం పెరిగింది. ఈ చర్యలు కూడా వృద్ధికి దోహదపడ్డాయని ఇక్రా తెలిపింది. రాబోయే నెలల్లో నమోదయ్యే డిమాండ్‌ను వృద్ధి ఆధారపడి ఉంటుందని ఇక్రా వెల్లడించింది.


Next Story

Most Viewed