ఫేక్​ వీడియోలపై ఈసీ సీరియస్​

by  |
ఫేక్​ వీడియోలపై ఈసీ సీరియస్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: హూజూరాబాద్​ ఉపఎన్నికల సమయంలో సృష్టించిన ఫేక్​ వీడియోలపై ఈసీ(ఎన్నికల కమిషన్​) నిఘా పెట్టింది. ఈ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారి జాబితాను రెడీ చేస్తున్నది. ముఖ్యంగా పోలింగ్​ జరుగుతున్నా సోషల్​ మీడియాల్లో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ శశాంక్​ గోయల్​ ఎన్నికల సిబ్బందికి సూచించారు. దీంతో ఎన్నికల అధికారులు ఫేక్​ వీడియోలను సృష్టించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పార్టీల వారీగా కొంతమంది వ్యక్తుల వివరాలు సేకరించిన అధికారులు.. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కూడా ఈసీ పూర్తి స్థాయిలో విచారిస్తున్నది. ఇదిలా ఉండగా ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో సోషల్​ మీడియా ప్రభావం ఎక్కువ కనిపించింది. అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించారు. క్షేత్రస్థాయి లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు సోషల్​ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే పోలింగ్​ రోజూ కొందరు వ్యక్తులు సోషల్​ మీడియాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నది.


Next Story

Most Viewed