- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల గెలుపు.. బీజేపీ నేతల్లో సంబురాలు.. ఆఫీసులో కోలాహలం
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ బైపోల్‌లో ఈటల గెలుపుతో బీజేపీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల రాకతో రాష్ట్ర పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబురాల్లో పాల్గొంటున్నారు. ఈటల గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకుని కార్యాలయం ఆవరణలో ఊరేగించారు. అనంతరం నేతలంతా విజయ సంకేతం చూపుతూ సంబురాల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ బైపోల్‌లో ఈటల గెలుపుతో బీజేపీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల రాకతో రాష్ట్ర పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబురాల్లో పాల్గొంటున్నారు. ఈటల గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకుని కార్యాలయం ఆవరణలో ఊరేగించారు.
అనంతరం నేతలంతా విజయ సంకేతం చూపుతూ సంబురాల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, బండి సంజయ్ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సంబురాల్లో రాష్ట్రస్థాయి నాయకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






