హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-06-02 23:38:39  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. ఈటల సమాచారం తెలుసుకున్న అనుచరులు, అభిమానులు ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటల ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో మీడియా ప్రతినిధులు.. బీజేపీలో చేరుతున్నారా అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ఈటల సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ఢిల్లీలో ఈటల బీజేపీ పెద్దలతో మంతనాలు [&hellip;]</p>

హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. ఈటల సమాచారం తెలుసుకున్న అనుచరులు, అభిమానులు ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటల ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో మీడియా ప్రతినిధులు.. బీజేపీలో చేరుతున్నారా అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ఈటల సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ఢిల్లీలో ఈటల బీజేపీ పెద్దలతో మంతనాలు చేసిన విషయం తెలిసిందే. అక్కడ చర్చలు ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈటల తదుపరి కార్యచరణపై తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది.

Next Story