వాజ్‌పేయి చేసిన సేవలు మరువలేనివి: ఈటెల రాజేందర్

by  |
Eetala rajendar
X

దిశ,మేడ్చల్ టౌన్: భారత జాతి గర్వపడే బిడ్డ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి అని మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొనియాడారు. అటల్ బిహారి వాజ్ పేయి 97వ జయంతి సందర్భంగా శనివారం మేడ్చల్ పట్టణంలో ఆయన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గొప్ప త్యాగశీలి, మానవతా మూర్తి వాజ్ పేయి ఆశయాలను భావితరాలకు అందించే సంకల్పంలో భాగంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని అన్నారు.

మహనీయుల విగ్రహాలు, జయంతి ఉత్సవాలు వారి ఆశయాలు, త్యాగాలు రాబోయే తరాలకు తెలియజేయాలని ఈటల రాజేందర్ తెలిపారు. వాజ్ పేయి జీవిత చరిత్ర భారతీయ జనతా పార్టీకే కాకుండా యావత్ భారతావనికి గర్వకారణమని అన్నారు. భారత ప్రధానిగా ఉన్నప్పుడు అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల చేత శభాష్ అనిపించుకున్న ఏకైక నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి ఒక్కరే అని ఈటల రాజేందర్ తెలిపారు. అలాంటి నాయకుడి విగ్రహాన్ని మేడ్చల్‌లో పెట్టుకోవడం ఈ ప్రాంత ప్రజానికానికే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గర్వకారణమని ఈటల రాజేందర్ చెప్పారు. ఈ సందర్భంగా విగ్రహ దాత కేశవరెడ్డి, స్థల దాత సంతోష్ చారిని ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి,కేశవరెడ్డి, లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జగన్ గౌడ్ , బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు,ధాత్రిక లక్ష్మణ్, తాళ్లపల్లి ఉపేందర్, సంతోష్ వేలూరి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, అర్జున్, వంశీ, బుద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed