- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ అహంకారంపై ప్రజల విజయమిది : ఈటల
by Vadlamudi Anukaran |
<p>దిశ, శామీర్‌పేట్ : కేసీఆర్ బెదిరింపులను లెక్క చేయకుండా హుజూరాబాద్ ఓటర్లు తనను గెలిపించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల అనంతరం తన నివాసానికి వస్తూ మార్గమధ్యంలోని శామీర్‌పేట్ కట్ట మైసమ్మను ఈటల గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం కేసీఆర్ అహంకారంపై ప్రజల విజయమని అన్నారు. తన గెలుపు కోసం అన్ని వర్గాల వారు కలిసి కట్టుగా తనకు ఓట్లు వేసి గెలిపించారని వారికి […]</p>

X
దిశ, శామీర్‌పేట్ : కేసీఆర్ బెదిరింపులను లెక్క చేయకుండా హుజూరాబాద్ ఓటర్లు తనను గెలిపించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల అనంతరం తన నివాసానికి వస్తూ మార్గమధ్యంలోని శామీర్‌పేట్ కట్ట మైసమ్మను ఈటల గురువారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం కేసీఆర్ అహంకారంపై ప్రజల విజయమని అన్నారు. తన గెలుపు కోసం అన్ని వర్గాల వారు కలిసి కట్టుగా తనకు ఓట్లు వేసి గెలిపించారని వారికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శామీర్‌పేట్, మూడుచింతలపల్లి, తూముకుంట మున్సిపాలిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






