- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఢిల్లీకి ఈటల.. టూర్‌పై బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కనబరచడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఈటలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కాల్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. కాగా గెలుపు అనంతరం ఈటల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కనబరచడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఈటలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కాల్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. కాగా గెలుపు అనంతరం ఈటల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈటల గెలుపు అనంతరం బీజేపీలో జోష్ మరింత ఎక్కువైంది. వాస్తవానికి హుజురాబాద్‌లో బీజేపీకి అనుకున్నంత కేడర్ లేదు. కేవలం ఈటల చరిష్మాతోనే ఉప ఎన్నిక బీజేపీ వశమైంది. కాగా బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో అధిష్టానం సైతం భవిష్యత్ కార్యాచరణకు ఇదే దూకుడును కొనసాగించాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.






