అమెజాన్ ప్రైమ్‌లో ‘దుర్గావతి’

by  |
అమెజాన్ ప్రైమ్‌లో ‘దుర్గావతి’
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన భాగమతి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. అశోక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను దుర్గావతి పేరుతో హిందీలో రీమేక్ అవుతుండగా..తానే డైరెక్ట్ చేస్తున్నారు. భూషణ్ కుమార్, అక్షయ్ కుమార్, విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటున్నది.

https://www.instagram.com/p/CGHDDO7JEJu/?utm_source=ig_web_copy_link

బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ చేస్తుండగా..ఓ పురాతన తలుపు దగ్గర కూర్చున్న పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ, ఆ తలుపు వెనుక ఏముంది? అంటూ ఫస్ట్ లుక్ షేర్ చేసిన భూమి..అది తెలుసుకోవాలంటే డిసెంబర్ 11 వరకు వెయిట్ చేయాలని సూచించింది. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించింది. సేన్ గుప్తా, మహి గిల్, కరణ్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం సమకూరస్తున్నారు.


Next Story

Most Viewed