బుర్జ్ ఖలీఫా‌పై ప్రదర్శించబడిన ‘కురుప్’ ట్రైలర్.. ఆనందంలో హీరో ఫ్యాన్స్

by  |
బుర్జ్ ఖలీఫా‌పై ప్రదర్శించబడిన ‘కురుప్’ ట్రైలర్.. ఆనందంలో హీరో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌ పోషించిన ‘కురుప్’ మూవీ శుక్రవారం విడుదలకు సిద్దంగా ఉంది. బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై ఆవిష్కరించారు. ఈ సినిమాను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక బుర్జ్ ఖలీఫా‌పై ప్రదర్శించిన తొలి సౌత్ ఇండియన్ మూవీ ట్రైలర్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో కమ్ ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్.. ‘మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల కరోనా పాండమిక్ కారణంగా ఆలస్యమైంది. అయితే ట్రైలర్‌ను ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ చిత్రానికి దాదాపు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాం. ఈ మూవీ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’ అని తెలిపాడు.

Next Story

Most Viewed