నజ్రియాతో రిలేషన్ ఓ మిస్టరీ : దుల్కర్

by  |
నజ్రియాతో రిలేషన్ ఓ మిస్టరీ : దుల్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాలీవుడ్ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్.. ‘బెంగళూరు డేస్’లో కోస్టార్‌గా నటించిన నజ్రియా నజీమ్‌కు బెస్ట్ బర్త్‌డే విషెస్ అందించారు. దుల్కర్, నజ్రియా కేవలం కో స్టార్స్ మాత్రమే కాదు కుటుంబసభ్యుల మాదిరిగానే కలిసిపోతారు. ఈ క్రమంలోనే దుల్కర్ తనకు హార్ట్ టచింగ్ వర్డ్స్‌తో సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. తను హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకున్నారు.

బర్త్‌డే గర్ల్‌తో కలిసి ఉన్న సూపర్ క్యూట్ పిక్చర్ షేర్ చేసిన దుల్కర్.. లిటిల్ బాల్ ఆఫ్ జాయ్‌కు హ్యాపీ బర్త్‌డే అని తెలిపారు. ‘డియరెస్ట్ కున్యి.. మనిద్దరం కలిసినప్పుడు ప్రాపర్ ఫొటోలు తీసుకోవడమే మరిచిపోతున్నాం. మరో మిస్టర్ నుంచి వచ్చిన సిస్టర్.. మాకు ఇదో మిస్టరీ. అసలు నువ్వు మా కుటుంబంలో ఎందుకు పుట్టలేదా? అని.. నీకు క్లోజ్ అయిన వాళ్లందరూ ఇలాంటి డౌట్‌తోనే ఉంటారనుకుంటున్నా. నా కోసం, నా కుటుంబం కోసం ఎల్లప్పుడూ సపోర్ట్‌గా ఉంటున్నందుకు, హ్యాపీనెస్ పంచుతున్నందుకు థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా హ్యాపీ బర్త్‌డే సిస్టర్ అంటూ థ్రో బ్యాక్ పిక్చర్ షేర్ చేసి నజ్రియాకు విషెస్ అందించారు.

Next Story