- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కావాలని చేయలేదు.. మహిళ రిపోర్టర్ కు దుల్కర్ క్షమాపణ
<p>హీరో దుల్కర్ సల్మాన్ వరనే అవశ్యముంద్ సినిమా ద్వారా నిర్మాతగా మారారు. అనూప్ సత్యన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. అయితే సినిమాలో తనను బాడీ షేమింగ్ చేశారని… తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ముంబై లేడీ రిపోర్టర్. దీంతో తనకు క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు దుల్కర్. మా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించాలని… అసలు ఏం జరిగిందో సంబంధిత డిపార్ట్మెంట్ ను అడిగి తెలుసుకుంటామన్నారు. కావాలని మాత్రం […]</p>

హీరో దుల్కర్ సల్మాన్ వరనే అవశ్యముంద్ సినిమా ద్వారా నిర్మాతగా మారారు. అనూప్ సత్యన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. అయితే సినిమాలో తనను బాడీ షేమింగ్ చేశారని… తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ముంబై లేడీ రిపోర్టర్. దీంతో తనకు క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు దుల్కర్. మా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించాలని… అసలు ఏం జరిగిందో సంబంధిత డిపార్ట్మెంట్ ను అడిగి తెలుసుకుంటామన్నారు. కావాలని మాత్రం ఈ తప్పు చేయలేదని… కానీ దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నామని చెప్పారు. మూవీ యూనిట్ తరపున క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు.
కాగా సినిమా డైరెక్టర్ కూడా దీనిపై స్పందించారు. రిపోర్టర్ కు సారీ చెప్పిన ఆయన… వరనే అవశ్యముంద్ సినిమా సెక్సిజం కు వ్యతిరేకంగా ఉంటుందని… మహిళలను అవమానించడం మా ఉద్దేశం కాదని చెప్తూ క్షమాపణలు కోరారు. కాగా ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు.
Tags: Dulquer Salmaan, Anoop Sathyan, Varane Avashyamund, Mollywood






