మోహన్‌లాల్ బర్త్‌డే కానుకగా "దృశ్యం 2"

by  |
మోహన్‌లాల్ బర్త్‌డే కానుకగా దృశ్యం 2
X

మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘దృశ్యం 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఇందుకు సంబంధించి టైటిల్‌తోపాటు మోహన్‌లాల్ లుక్‌తో కూడిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. 2013లో వచ్చిన దృశ్యం సినిమా భారీ సక్సెస్ అందుకోగా.. తెలుగు, తమిళ్‌తోపాటు హిందీలోనూ రీమేక్ చేయబడి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ సమర్పణలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. సినిమాలో నటీనటులు, టెక్నీషియన్ల గురించి త్వరలో ప్రకటించనున్నారు.

మాలీవుడ్ సినిమాను దృశ్యం పేరుతోనే విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయగా మంచి హిట్ అయింది. అయితే ఇప్పుడు మోహన్‌లాల్‌కు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. జనతా గ్యారేజ్ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. దీంతో దృశ్యం 2 సినిమాను డైరెక్ట్‌గా తెలుగులో రిలీజ్ చేస్తారా లేక నిర్మాతలు సినిమా రీమేక్‌పైనే ఇంట్రెస్ట్ చూపుతారా? అనేది తెలియాలి.

https://twitter.com/Mohanlal/status/1263379181032726529?s=20


Next Story

Most Viewed