- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం..
<p>దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖతార్ ఎయిర్ లైన్స్ (QR-500) విమానంలో.. దోహా నుండి హైదరాబాద్ వచ్చిన జింబాబ్వేకు చెందిన మాకుంభ కరోల్ అనే మహిళను అధికారులు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆమె లగేజీలో ఎనిమిది […]</p>

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖతార్ ఎయిర్ లైన్స్ (QR-500) విమానంలో.. దోహా నుండి హైదరాబాద్ వచ్చిన జింబాబ్వేకు చెందిన మాకుంభ కరోల్ అనే మహిళను అధికారులు చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఆమె లగేజీలో ఎనిమిది కిలోల హెరాయిన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకొన్నట్టు తెలిపారు. హెరాయిన్ విలువ సుమారు 53 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సదరు మహిళపై గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయా లేక ఈ మహిళ వెనుక ఇంకెవరైనా స్మగ్లర్లు ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.






