ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్

by  |
ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్
X

దిశ వెబ్‌డెస్క్: ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఒక రోజు వెళితే పని అవుతుందనే గ్యారంటీ అసలు లేదు. ఇక అధికారులకు ఎంతో కొంత చేతిలో పడాల్సిందే. అయితే ఇప్పటినుంచి అలాంటి కష్టాలు ఇక ఉండవు. ఎంతో చక్కగా ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు.

తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్‌లో 18 రకాల సేవలను పొందవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. Parivahan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
2. అందులోని ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో కనిపించే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఆప్షన్ ఎంచుకోండి
3. ఆ తర్వాత మీ రాష్ట్రం పేరును ఎంచుకుని డేట్ ఆఫ్ బర్త్ , డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్ కోడ్ వివరాలు ఇవ్వండి
4. తర్వాత మీ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి
5. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఒక మెసేజ్ వస్తుంది.
6. రెన్యూవల్ ఛార్జీని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అవుతుంది.


Next Story

Most Viewed