పెద్దపల్లిలో దారుణం.. SRSP కెనాల్‌లో పడిపోయిన ట్రాక్టర్

by  |
పెద్దపల్లిలో దారుణం.. SRSP కెనాల్‌లో పడిపోయిన ట్రాక్టర్
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామ శివారులోని ఎస్సారెస్పీ డీ 86 కెనాల్‌లో అదుపుతప్పి ట్రాక్టర్ పడిపోయింది. కనుకుల గ్రామానికి చెందిన డ్రైవర్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గల్లంతయ్యాడు. సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి చొప్పదండి వద్ద కెనాల్ వాటర్‌ని బంద్ చేయించారు. శ్రీనివాస్ ఆచూకీ కోసం సుమారు రెండు గంటలుగా గాలిస్తున్నారు.

శ్రీనివాస్‌కు భార్య రజిత, అబ్బాయి అభిరామ్ అమ్మాయి మిన్ను ఉన్నారు. ట్రాక్టర్ కెనాల్‌లో పడిపోయిన సమయంలో డ్రైవర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడా లేదా భయపడి ఎటైనా పారిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని బంద్ చేయించడంతో ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గిపోగా.. శ్రీనివాస్ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed