ప్లాస్టిక్, పేపర్ కప్పులో ‘టీ ’ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త

by  |
ప్లాస్టిక్, పేపర్ కప్పులో ‘టీ ’ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు.. కాస్త టైం దొరికితే చాలు, చాలా మంది బయటకు వెళ్లి టీ తాగి వస్తారు. అయితే ఈ టీ తాగడం వలన మనసుకు కాస్త ప్రశాంతగా అనిపించినా.. ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం ద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఏ హోటల్స్‌లో చూసిన పేపర్ కప్పులే దర్శనం ఇస్తుంటాయి. అయితే రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరినట్టే. ఎందుకంటే 5వేల మైక్రాన్-పరిమాణ మైక్రోప్లాస్టిక్ కణాలు 100 mL వేడి ద్రవంలోకి 15 నిమిషాల పాటు కాగితపు కప్పులలో నివసిస్తాయి. దానివల్ల సగటున రోజులో 3సార్లు టీ తాగే వ్యక్తి 75వేలకి పైగా మైక్రో ప్లాస్టిక్ కణాలని తీసుకుంటాడని తెలిపారు. దీని వలన అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్లాస్టిక్ కప్పులు మన శరీరంపై తీవ్ర స్థాయిలో సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల మనకి తెలియకుండానే ప్లాస్టిక్ కణాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఈ ముప్పు రెండు విధాలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి వాడి పడేసే వీలుండటంతో ప్లాస్టిక్ గ్లాసులకు ఆదరణ పెరిగింది. కానీ ఈ కప్పులోనే మనకు తెలియని విషం ఉంది. ఈ కప్పులపై తరచుగా సూక్ష్మక్రిములు తిష్టవేసి ఉంటాయని, నోటి లాలాజలాల ద్వారా లోపలికి వెళ్లిపోతాయని అంటున్నారు. ప్లాస్టిక్ కప్పుల్లో లోపల ఓ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ కారణంగా కప్ వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది. దీంట్లోని రసాయనాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికి సైతం పలు విధాలా హాని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా పేపర్ గ్లాసులో వేడి వేడి టీ తాగడం వల్ల అందులో పల్చటి పొర కరిగి దాని ద్వారా పెల్లాడియం, క్రోమియం, కాడ్మియం అనే విష పదార్థాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఈ ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు.


Next Story

Most Viewed