- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబు హల్ చల్.. బస్సుకు ఎదురుగా వెళ్లి..
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ చౌరస్తా వద్ద ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. బస్టాండ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఏసీ బస్సును అడ్డుకుని వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి నానా హంగామా చేశాడు. బస్సు బంపర్ ఎక్కి మరీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. తాగిన మైకంలో చనిపోతానని బస్సుకు అడ్డంగా వెళ్లి అందర్నీ హడలెత్తించాడు. డ్రైవర్ సహా పలువురు అతన్ని వారించినా మందుబాబు […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ చౌరస్తా వద్ద ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. బస్టాండ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఏసీ బస్సును అడ్డుకుని వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి నానా హంగామా చేశాడు. బస్సు బంపర్ ఎక్కి మరీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.తాగిన మైకంలో చనిపోతానని బస్సుకు అడ్డంగా వెళ్లి అందర్నీ హడలెత్తించాడు. డ్రైవర్ సహా పలువురు అతన్ని వారించినా మందుబాబు మాత్రం ససేమిరా అని మొండికేయడంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. పోలీసులు వచ్చినా బస్సు పై నుండి దిగకుండా యువకుడు గొడవ చేస్తూనే ఉండడంతో బలవంతంగా అక్కడి నుండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నానా హంగామా చేసిన యువకుడిని పెద్దపల్లి పట్ణణానికి చెందిన అన్వేష్ గా గుర్తించారు. యువకుని హల్ చల్ కారణంగా పెద్దపల్లి రాజీవ్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.






