శౌర్యం ప్రదర్శించిన ‘శౌర్య క్షిపణి’..

by  |
శౌర్యం ప్రదర్శించిన ‘శౌర్య క్షిపణి’..
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత రక్షణ వ్యవస్థ రోజురోజుకూ అప్‌డేట్ అవుతూ వస్తోంది. పొరుగుదేశాలతో ముప్పు పొంచియున్న క్రమంలో అణుక్షిపణుల సామర్థ్యాన్ని కూడా భారత్ మరింత పెంచుకుంటోంది. నిన్న బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరిక్షించిన మన దేశం.. ఇవాళ శౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా అది సక్సెస్ అయ్యింది.

ఒడిశాలోని బాలాసోర్ తీరంలో డీఆర్‌డీవో అధికారులు ఈ క్షిపణిని టెస్ట్ చేశారు. శౌర్య క్షిపణి చాలా తేలికైనదని, దీనిని సులువుగా పరీక్షించవచ్చునని తెలిపారు. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉందని తెలుస్తోంది.



Next Story