‘డబుల్’ ఇళ్లను తీసుకుని తప్పుచేశాం.. వీటికంటే ‘గుడిసె’లే బెటర్

by  |
‘డబుల్’ ఇళ్లను తీసుకుని తప్పుచేశాం.. వీటికంటే ‘గుడిసె’లే బెటర్
X

దిశ, కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో ప్రభుత్వం నిరుపేదలకు 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అయితే, అధికారుల పర్యవేక్షణ లోపంతో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అసంపూర్తిగా పనులు పూర్తి చేశాడు. దీని వలన చిన్న పాటి వర్షం కురిసినా ఇళ్లంతా వరద మయంగా మారుతోంది. లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేసి 7 నెలలు గడుస్తున్నా నేటికీ కరెంటు, నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అదే విధంగా దోమల సమస్య కూడా తీవ్రంగా వేధిస్తుందని, కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు వస్తే తమ సమస్యలు తీరుతాయని ఎంతో సంతోషించామని.. కానీ, వీటిని తీసుకోవడం వలన కష్టాలు రెట్టింపు అయ్యాయన్నారు. రేకులు, గుడిసెల కన్నా అధ్వాన్నంగా డబుల్ బెడ్ రూం ఇళ్లున్నాయని లబ్దిదారులు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, తమ ఏరియాలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డబుల్ లబ్దిదారులు వలంగి సుశీల, రమణ, మేకల సరిత, బైర్ల రాజేశ్వరి కోరారు.


Next Story

Most Viewed