- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఎమ్మెల్యే సొంత ఊర్లో ఆదిలోనే ఆగిన డబుల్ బెడ్ రూం ఇండ్లు
<p>దిశ, ఆమనగల్లు: డబుల్ బెడ్ రూం ఇండ్లు శిలాఫలకానికే పరిమితం అయ్యాయి. కడ్తాల్ మండలం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్వగ్రామమైన చల్లంపల్లి గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆదిలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ గ్రామంలో 2015 అక్టోబర్ 26వ తేదీన అప్పటి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 2014 ఎన్నికల ముందు రాష్ర్టంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదోడికి డబుల్ బెడ్ రూం […]</p>

దిశ, ఆమనగల్లు: డబుల్ బెడ్ రూం ఇండ్లు శిలాఫలకానికే పరిమితం అయ్యాయి. కడ్తాల్ మండలం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్వగ్రామమైన చల్లంపల్లి గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆదిలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ గ్రామంలో 2015 అక్టోబర్ 26వ తేదీన అప్పటి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 2014 ఎన్నికల ముందు రాష్ర్టంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదోడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు దాటినా నేటికి శంఖుస్థాపన చేసిన ఇండ్లు.. నిర్మాణ దశకు రాలేదు. శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జైపాల్ యాదవ్.. తన స్వంత గ్రామానికే మంజూరైన ఇండ్ల నిర్మాణం చేపట్టలేదని.. ఇక నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ఎలా చేపడుతారని యువజన కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అర్హుడైన పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.






