మరోసారి బాక్సాఫీస్ కొల్లగొట్టేందుకు సిద్ధమైన యాక్షన్ థ్రిల్లర్

by  |
మరోసారి బాక్సాఫీస్ కొల్లగొట్టేందుకు సిద్ధమైన యాక్షన్ థ్రిల్లర్
X

దిశ, సినిమా: బ్లైండ్ వెటరన్ నార్మన్ నార్డ్‌స్ట్రోమ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన హింసాత్మక యాక్షన్ థ్రిల్లర్ #డోంట్‌బ్రీత్‌.. బాక్స్ ఆఫీస్ వద్ద $ 45.2 మిలియన్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కాగా కిడ్నాప్‌కు గురైన మహిళను కాపాడే ప్రయత్నంతో తెరకెక్కిన చిత్రం ప్రేక్షకుల్లో భారీ ఆదరణ పొందింది. దీంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మరోసారి తెరకెక్కిస్తున్న మేకర్స్ తాజాగా ‘#డోంట్‌బ్రీత్‌2’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అంధ అనుభవజ్ఞుడైన వెటరన్.. ఇనుప సుత్తితో అద్దాన్ని బద్దలు కొడుతున్నట్లుగా ఉన్న పోస్టర్.. చీకటి ప్రపంచం నుండి వెలుగులోకి ప్రవేశిస్తున్నట్లుగా అర్థాన్ని ఇస్తూ.. ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేసింది. కాగా 90 నిమిషాల పాటు సాగే ఈ చిత్రాన్ని.. ఫెడె అల్వారెజ్, సామ్ రైమి, రాబ్ టాపెర్ట్ నిర్మించగా.. రోడో సాయాగ్స్ దర్శకత్వం వహిస్తున్నారు.



Next Story