జిల్లా జైలుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ అందజేత

by  |
oxygen concentrator
X

దిశ, ఖమ్మం రూరల్​: ది ఆర్ట్ ​అఫ్ ​లివింగ్ ​సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవతా విలువల సంస్థ(ఐఎహెచ్​వీ) సహకారంతో ఖమ్మం నగరంలో గల జిల్లా జైలుకు రెండు ‘ఆక్సిజన్​ కాన్సంట్రేటర్స్​’ ను పర్యవేక్షణాధికారి ఏ. శ్రీధర్​కు అందజేశారు. ది ఆర్ట్​ అఫ్ లివింగ్​ వ్యవస్థపాకులు పండింట్ ​రవిశంకర్ 1997లో ఈ సంస్థను స్థాపించి ప్రభుత్వ హస్పిటల్స్​లో సాంకేతిక పరికరాలను, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి బండి చైతన్య తెలిపారు. ఆక్సిజన్ ​కాన్సంట్రేటర్స్ అందజేసిన సంస్థకు ప్రతినిధులకు జైలు అధికారులు విజయ్, సక్రునాయక్, డిప్యూటీ జైలర్ ​పీ. కృష్ణకాంత్​లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ నిర్వహకులు ఎస్​కే రహీం, రవి, శ్రీనివాస్​రెడ్డి, డాక్టర్​ శ్రీకాంత్​ తదితరులు ఉన్నారు.

Next Story