సౌత్ ఫిల్మ్ మేకర్‌పై టీవీ నటి మీటూ ఆరోపణలు

by  |
సౌత్ ఫిల్మ్ మేకర్‌పై టీవీ నటి మీటూ ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీవీ నటి డోనాల్ బిష్ట్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజా ఇంటర్వ్యూలో వివరించింది. ఏక్ దివానా థా, రూప్ మర్ద్ కా నయా స్వరూప్ లాంటి షోస్‌తో పాపులారిటీ సంపాదించిన డోనాల్..తను చదివింది జర్నలిజమే అయినా యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేదని తెలిపింది. ఫ్రెండ్స్ కూడా తమ షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్‌లో నటించాలని కోరేవారని తెలిపింది. తాను న్యూస్ డెస్క్ దగ్గర కూర్చున్నా సరే మనసు మొత్తం నటనవైపే ఉండేదని.. దీంతో యాక్టర్ అయిపోవాలని డిసైడ్ అయినట్లు తెలిపింది.

ఈ క్రమంలోనే ఆడిషన్స్‌కు వెళ్లిన తను ఓ షోకు సెలెక్ట్ అయ్యానని..రెమ్యునరేషన్ కూడా ఫైనల్ చేశారని చెప్పింది. కానీ, కొన్ని రోజుల తర్వాత తన ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను తీసుకున్నారని..దీంతో ఇండస్ట్రీ ఫేక్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ముంబైలో ప్రజలంతా అబద్దాలు చెప్పేవారనే నిర్ణయానికి వచ్చానని తెలిపింది. అయినా కూడా యాక్టర్ అవ్వాలనే కోరిక చంపుకోలేని తాను.. మరో ఆడిషన్స్‌కు వెళ్లానని చెప్పింది. ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఫిల్మ్ మేకర్ తనతో రాత్రంతా గడిపితే చాన్స్ ఇస్తానని అసభ్యంగా మాట్లాడాడని..పోలీసులకు కంప్లైంట్ చేశానని వెల్లడించింది డోనాల్. పరిస్థితులు కఠినంగా ఉన్నా..రైట్ వేలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపింది.

Next Story

Most Viewed