- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసలెవరీ డాలర్ బాబు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం ఘటనపై నగర పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. తనపై 139 మంది అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, పలుమార్లు కులం పేరుతో దూషించారంటూ ఓ బాధిత యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పలు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అంతకంటే ముందు అత్యాచారం కేసులో 139 మంది వ్యక్తుల పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే డాలర్ బాయ్ అనే […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం ఘటనపై నగర పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. తనపై 139 మంది అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, పలుమార్లు కులం పేరుతో దూషించారంటూ ఓ బాధిత యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పలు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.
అంతకంటే ముందు అత్యాచారం కేసులో 139 మంది వ్యక్తుల పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే డాలర్ బాయ్ అనే వ్యక్తి బాధితురాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తేలింది. ఆమెతో పాటు ఇతరులను కూడా డాలర్ బాయ్ ఫోన్లు చేసి బెదిరించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో డాలర్ బాయ్, డిటెక్టివ్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలుజిల్లాల్లో డాలర్ బాయ్ అరాచకాలపై బాధితులు ఫిర్యాదు చేసినట్లు పలు పోలీస్‌స్టేషన్లలో రికార్డులు ఉన్నట్లు పంజాగుట్టు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ ప్రదీప్ నిన్న స్పందించారు.






