శంషాబాద్‌లో డోకాష్ ‘ఆప్టికూలర్’ కంటెయినర్ స్టేషన్‌

by  |
shamsabad
X

దిశ రాజేంద్రనగర్ : జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో బుధవారం ఆప్టికూలర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్‌ల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ స్టేషన్‌ను ప్రారంభించడానికి జర్మనీకి చెందిన డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్స్‌తో ఒక నూతన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్ గ్లోబల్ సర్వీస్ స్టేషన్ నెట్‌వర్క్‌లో ఇది మొదటిది కాగా, ఏకైక భారతీయ కేంద్రం. ఫార్మా జోన్ పేరిట ఫార్మా ఎక్స్‌పోర్ట్ టెర్మినల్‌తో జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో దక్షిణ మధ్య భారతదేశంలో ఫార్మా ఎగుమతులకు ప్రసిద్ధి చెందింది.

ప్రాణాలను కాపాడే ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడం కోసం స్థానిక ఔషధ తయారీదారులు, ఫార్వార్డర్‌లు, ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్ నెట్‌వర్క్ స్టేషన్‌లో కంటైనర్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. కొవిడ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వ్యాక్సిన్‌ల హైదరాబాద్ ఆధారిత వ్యాక్సిన్ తయారీదారులు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నందున కొత్త స్టేషన్ ప్రారంభించే సమయం కూడా సరైనది దొరికింది.

ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ దక్షిణాసియా ప్రాంతంలోని ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లకు ప్రధానమైన గేట్‌వే. మా కార్గో టెర్మినల్లో ఒక సర్వీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం మాకు చాలా సంతోషకరం. కొత్త ఫెసిలిటీ వల్ల ప్రపంచ స్థాయి డోకాష్ ఆప్టికూలర్ కంటైనర్‌లను మా వినియోగదారులకు తక్షణం, సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ ఫెసిలిటీతో జిఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఈ ప్రాంతంలో టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్‌లకు అతిపెద్ద కేంద్రంగా ఉంటుంది అన్నారు.


Next Story

Most Viewed