- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సైరన్ వాడితే అంతే సంగతి..!
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: వాహనాలతో కిక్కిరిసిపోతున్న రోడ్లు, జనం రోడ్డుపై ఉన్నప్పుడు పోలీస్ సైరన్ వినిపించి తమ వాహనాలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఒక్కోసారి పోలీసులు కూడా సైరన్ విని తమ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్లు అనుకుని అలర్ట్ అయిన సంఘటనలూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు పోలీస్ సైరన్‌తో ప్రజలను కంగారు పెట్టించే ప్రయత్నానికి చెక్ పెడుతున్నారు రామగుండం పోలీసులు. గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలో కారుకు పోలీస్ సైరన్ […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్:
వాహనాలతో కిక్కిరిసిపోతున్న రోడ్లు, జనం రోడ్డుపై ఉన్నప్పుడు పోలీస్ సైరన్ వినిపించి తమ వాహనాలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఒక్కోసారి పోలీసులు కూడా సైరన్ విని తమ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్లు అనుకుని అలర్ట్ అయిన సంఘటనలూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు పోలీస్ సైరన్‌తో ప్రజలను కంగారు పెట్టించే ప్రయత్నానికి చెక్ పెడుతున్నారు రామగుండం పోలీసులు.
గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలో కారుకు పోలీస్ సైరన్ పెట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సైరన్ ఉపయోగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న సమాచారంతో సంతోష్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు సీఐ పర్శ రమేష్ తెలిపారు. సంతోష్‌పై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇకపై పోలీస్ సైరన్ ఉపయోగించే వారు తమ వాహనాల నుంచి వాటిని తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని సీఐ రమేష్ హెచ్చరించారు.






