- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకనైనా మానేయండి.. సీఎం కేసీఆర్‌కు డీకే అరుణ వార్నింగ్
<p>దిశ, మహబూబాబాద్ టౌన్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మూడు రోజుల పాటు జరిగే బీజేపీ మహబూబాబాద్ జిల్లా శిక్షణ తరగతులను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని, సగం సగం పనులు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులు […]</p>

దిశ, మహబూబాబాద్ టౌన్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మూడు రోజుల పాటు జరిగే బీజేపీ మహబూబాబాద్ జిల్లా శిక్షణ తరగతులను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని, సగం సగం పనులు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
రైతు బంధు, రైతు బీమాతో రైతులు సంతృప్తిగా ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయన్నారు. రైతులకు సరైనా భరోసా కల్పిస్తే మరణాలు జరగవన్నారు. ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారని అందుకే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీకే పట్టం కట్టారంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పనైపోతుందన్నారు. 2014, 2018 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని.. ఇప్పటికైనా కేసీఆర్ మోసాలు, అబద్దాలు, నాటకాలు మానేయాలంటూ డీకే అరుణ హెచ్చరించారు.






